జాతీయ వార్తలు

నేడు రాహుల్ నామినేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి యువనేత రాహుల్ గాంధీ సోమవారం నామినేషన్‌లు దాఖలు చేయబోతున్నారు. పార్టీ అధినేత్రి సోనియా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సహా సీనియర్ నేతల సమక్షంలో ఆయన నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తారు. ఆదివారం పొద్దుపోయే వరకూ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఇతరులెవరూ నామినేషన్‌లు దాఖలు చేయక పోవడంతో రాహుల్ ఎన్నిక లాంఛనంగానే మారింది. వరుసగా 19 సంవత్సరాలు పార్టీకి సారథ్యం వహించిన తన తల్లి సోనియా స్థానే ఈ పదవిని రాహుల్ చేపడతారు. మొత్తం నాలుగు సెట్లు నామినేషన్ పత్రాల్ని రాహుల్ దాఖలు చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.