జాతీయ వార్తలు

బాలీవుడ్ నటుడు శశికపూర్ కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 4: దాదాపు నాలుగు దశాబ్దాలపాటు తనదైన విశిష్ట నటనతో రాణించిన బాలివుడ్ నటుడు శశికపూర్ సోమవారం సాయంత్రం కన్నుమూశారు. 79 సంవత్సరాల శశికపూర్ ఇక్కడి కోకిలాబెన్ ధీరూభాయ్ అంబాని ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచినట్టు రణధీర్ కపూర్ వెల్లడించారు. గత కొన్ని సంవత్సరాలుగా శశికపూర్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారని, అలాగే నిరంతరం డయాలసిస్ చేయించుకుంటున్నారని రాజ్‌కపూర్ కుమారుడైన రణధీర్ వెల్లడించారు. శశికపూర్ అంత్యక్రియలు మంగళవారం ఉదయం ముంబయిలో జరుగుతాయని తెలిపారు. 1938 మార్చి 18న జన్మించిన శశికపూర్ తన నాలుగో ఏటే సినీ జీవితానికి శ్రీకారం చుట్టారు. తన తండ్రి పృథ్విరాజ్ కపూర్ దర్శకత్వంలో రూపొందిన నాటకాల్లో నటించారు. చివరిసారిగా బాలనటుడిగా 1948లో ‘ఆగ్’లోనూ, 1951లో ‘ఆవారా’లోనూ కనిపించారు. ఈ రెండు చిత్రాల్లో రాజ్‌కపూర్ చిన్ననాటి పాత్రలను శశికపూర్ పోషించారు. 50వ దశకంలోనే అనేక చిత్రాలకు సహాయ దర్శకుడిగా ఆయన పనిచేశారు. 1961లో ‘్ధర్మపుత్ర’ అనే చిత్రం ద్వారా నటుడిగా పరిచయం అయ్యారు. దాదాపు 116 సినిమాల్లో భిన్నమైన, వినూత్నమైన పాత్రలను పోషించి బాలివుడ్ ప్రిన్స్ చార్మింగ్‌గా ప్రేక్షక హృదయాలను దోచుకున్నారు. దీవార్, కభీ కభీ, నమక్‌హలాల్, కాలాపత్తర్ తదితర చిత్రాల్లో ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోయే విలక్షణమైన భూమికను పోషించారు. 2011లో పద్మభూషణ్, 2015లో ప్రతిష్ఠాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ఆయన పొందారు. సినీ రంగానికి నిరుపమాన సేవలు అందించిన శశికపూర్ మృతిపట్ల బాలివుడ్ నటీనటులు ప్రగాఢ సంతాపం తెలిపారు.