జాతీయ వార్తలు

మొగలాయిల వారసత్వమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ నామినేషన్ వేసిన నేపథ్యంలో ఆ పార్టీ వారసత్వ ప్రక్రియను మొగుల్ పాలకుల వారసత్వంతో పోలుస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర స్వరంతో ధ్వజమెత్తారు. అవినీతి కేసులో బెయిల్‌పై ఉన్న వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిగా నిర్ణయించే విషయంలో కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా ప్రజా విలువలను మంటగలిపిందన్నారు. కాంగ్రెస్ పాలనలో అవినీతి తాండవించిందని పేర్కొన్న మోదీ, గుజరాత్‌లో తాను సిఎంగా ఉన్నపుడు స్వచ్ఛమైన పాలనను అందించానని, అలాగే ప్రధానిగా అదే తరహా పాలనా విధానాన్ని కొనసాగిస్తున్నానని సోమవారం ఇక్కడ జరిగిన ఓ ఎన్నికల ర్యాలీలో మోదీ అన్నారు. ఈ సందర్భంగా ఆయన నేషనల్ హెరాల్డ్ కేసును పరోక్షంగా ప్రస్తావించారు. బెయిల్‌పైవున్న వ్యక్తిని జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించే విషయంలోనూ రాజకీయ పార్టీలు ఒకటికి నాలుగుసార్లు ఆలోచిస్తారని పేర్కొన్న మోదీ, ఇలాంటి వ్యక్తికి అధ్యక్ష పదవి కట్టబెట్టాలని నిర్ణయించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ తమ సంస్కృతిని మరోసారి చాటుకుందని, జహంగీర్ తరువాత షాజహాన్ వచ్చాడని, అప్పట్లో ఎలాంటి ఎన్నికలైనా జరిగాయా? అని మోదీ ప్రశ్నించారు. అలాగే షాజహాన్ తరువాత ఔరంజేబే ఆయన వారసుడిగా వచ్చేస్తాడన్న ప్రచారమూ జరిగిందన్నారు. దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీ కూడా అధికారాన్ని కుటుంబ ఆస్తిగా పంచుకుంటోందని పేర్కొన్న మోదీ, ఈ రకమైన ఔరంగజేబు పాలనను తాము కోరుకోవడం లేదని, తమకు సంబంధించినంత వరకూ దేశమే ముఖ్యమని, 125 కోట్లమంది ప్రజలే తమ హైకమాండ్ అని మోదీ అన్నారు. కాంగ్రెస్‌కు అధికారం ఇవ్వడం ద్వారా గుజరాత్ అభివృద్ధిని ఆటంకపరుస్తారా? అని కూడా ప్రజలను ప్రశ్నించారు. దానికి లేదూ, కాదూ అంటూ ప్రజలు హర్షధ్వానాలతో జవాబిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తరచూ ఆలయాలను రాహుల్ గాంధీ సందర్శించడం పైనా మోదీ వ్యగ్యోక్తులు విసిరారు. ఒకప్పుడు తమ లౌకిక భావనలను, విలువలను చాటుకునేందుకు నేతలు పోటీ పడేవారని, కానీ గుజరాత్ ఎన్నికలకు సంబంధించి జరుగుతున్న పోటీ ఏమిటని ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రశ్నించారు. దానికి ఆలయాలూ ఆలయాలూ అన్న సమాధానం వచ్చింది. గుజరాత్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ కపటత్వాన్ని అర్థం చేసుకోలేనంత మూర్ఖులు కారని, హిందూ ఓట్ల కోసమే ఆలయాల సందర్శన సాగుతోందన్న నిజాన్ని వారు గ్రహించే ఉంటారన్నారు. ముఖ్యమంత్రిగా, ప్రధానిగా పదవులు నిర్వహించిన తనపై ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదని మోదీ తెలిపారు. ‘నేను లబ్దిపొందానని ఏ పత్రికలోనైనా మీరు చదివారా? అలాగే, మోదీ సోదురుడుగానీ, బంధువుగానీ డబ్బులు తీసుకున్నట్టు మీరు ఎక్కడైనా, ఎప్పుడైనా విన్నారా? అలాగే మోదీ కుటుంబానికి చెందిన ఏ వ్యక్తి అయినా అక్రమానికి పాల్పడినట్టుగా ఎవరైనా, ఎక్కడైనా అన్నారా?’ అని మోదీ ప్రశ్నించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కుంభకోణాలమయంగా సాగిందని విమర్శించారు.