జాతీయ వార్తలు

గాలింపు చర్యలు ఆగవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, డిసెంబర్ 4: ఓఖి తుపానులో గల్లంతైన 100మంది మత్స్యకారుల ఆచూకీ కోసం కేరళ తీరంలో పెద్దఎత్తున ఆపరేషన్స్ నిర్వహిస్తున్నామని కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఆపరేషన్స్‌లో నేవీ ఓడలు, హెలికాఫ్టర్లు, తీర రక్షణ దళాల బోట్లు, వైమానిక దళాలు నిమగ్నమయ్యాయని, మత్స్యకారుల ఆచూకీ తెలిసేవరకూ ఆపరేషన్స్ కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఓఖి తుపాను దెబ్బతిన్న కేరళ ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన సీతారామన్, అనంతర పరిణామాలపై సోమవారం సిఎం పినరయ్ విజయన్‌తో సమావేశమయ్యారు. కేంద్ర, రాష్ట్రాలు సంయుక్తంగా తీసుకున్న చర్యలను సుదీర్ఘంగా సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ‘మత్స్యకారుల ఆచూకీ లభించేవరకూ ఆపరేషన్స్ కొనసాగుతాయని ప్రకటిస్తూ, ఇందులో ఎలాంటి మార్పూలేదు’ అన్నారు. ‘కేరళ తీరంనుంచి వేటకు వెళ్లిన ప్రతి మత్స్యకారుడినీ వెనక్కి తీసుకురాగలమన్న నమ్మకం మాకుంది’ అని ప్రకటించారు. ప్రకృతి వైపరీత్యంతో సర్వం కొల్పోయిన, ప్రాణాలుపోయిన మత్స్యకారుల కుటుంబాలకు నష్టపరిహారం పెంచాలన్న రాష్ట్ర ప్రతిపాదనపై స్పందిస్తూ, ‘క్షేత్రస్థాయిలోని పరిస్థితిని హోంమంత్రి, వ్యవసాయ మంత్రులకు వివరిస్తా. మత్స్యకార కుటుంబాలు భయానక పరిస్థితిని ఎదుర్కొంటున్న విషయాన్ని స్వయంగా చూశాను’ అని వ్యాఖ్యానించారు. తుపానుకు ముందు పక్షంరోజుల క్రితమే వేటకు వెళ్లిన కొందరు మత్స్యకారులను సముద్రంలో ఒకచోట గుర్తించామని, వాళ్లకు ఆహారం, మంచినీళ్లు అందించామని చెప్పారు.
మత్స్యకార గ్రామాల్లో పర్యటించిన సీతారామన్, బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పారు. రక్షణ చర్యలపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని సూచించారు. రెండు గ్రామాల్లోని మత్స్యకార కుటుంబాల మహిళలు మంత్రిని చుట్టుముట్టి విలపిస్తూ, రక్షణ చర్యలు తూతూమంత్రంగా సాగుతున్నాయంటూ ఆరోపించటంతో సీతారామన్ స్పందించారు. కేంద్ర మంత్రి సీతారామన్ వెంట రాష్ట్ర మత్స్యకార మంత్రి కెర్సీకుట్టి, దేవాదాయ మంత్రి కిడకంపల్లి సరేంద్రన్ ఉన్నారు.

చిత్రం..ఓఖి తుపానుకు దెబ్బతిన్న ప్రాంతాలను సందర్శించిన అనంతరం సోమవారం తిరువనంతపురంలో విలేఖరులతో మాట్లాడుతున్న నిర్మలా సీతారామన్