జాతీయ వార్తలు

భూకంపమే కారణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: టిబెట్ ప్రాంతంలో ఇటీవల సంభవించిన భారీ భూకంపం కారణంగానే పవిత్ర బ్రహ్మపుత్ర నదీ జలాలు బురదమయమైనట్టు పార్లమెంటరీ కమిటీ అధ్యయనంలో తేలిందని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మొగ్వాల్ స్పష్టం చేశారు. ‘పరిసరాల్లోని కాలుష్యం నదీ గర్భానికి చేరుతుండటంవల్లే బ్రహ్మపుత్ర జలాలు నలుపెక్కుతున్నట్టు ఫిర్యాదులు అందిన మాట వాస్తవమే. పరిస్థితిని పరిశీలించాల్సిందిగా సెంట్రల్ వాటర్ కమిషన్ (సిడబ్ల్యుసి)ను ఆదేశించాం’ అని మంత్రి స్పష్టం చేశారు. గత నవంబర్ 17న టిబెట్‌లో సంభవించిన భారీ భూకంపం కారణంగా నదీ పరీవాహకంలోని కొంతప్రాంతం దెబ్బతిని జలాలు నల్లగా మరాయన్నది ప్రాథమిక దర్యాప్తులో పేర్కొన్నట్టు తెలిపారు. ఇదే అంశంపై అరుణాచల్‌ప్రదేశ్ తూర్పు నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎంపీ నినోంగ్ ఎరింగ్ ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాయడం తెలిసిందే.