జాతీయ వార్తలు

బిజెపి ఎంపీ కోసం ప్రత్యేక రైలు..రాచ మర్యాదలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోపాల్, మే 2: మహారాష్ట్ర బిజెపి ఎంపీ పూనం మహాజన్ కోసం ప్రత్యే రైలు ప్రయాణం చేయడం, ఆమెకు రైల్వే అధికారులు రాచమార్యాదలు చేశారన్న వార్తలు దుమారం రేపాయి. ముంబయి వెళ్లే విమానాన్ని అందుకోడానికి బినా నుంచి భోపాల్‌కు ఎంపీ ప్రత్యేక రైలులో ప్రయాణం చేశారు. మే 31న ఈ సంఘటన చోటుచేసుకుంది. అయితే రైల్వే అధికారులు వీటన్నింటినీ తోసిపుచ్చారు. బినా-్భపాల్ డివిజన్ పశ్చిమ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ పరిధిలోకి వస్తుంది. ఓ ఎంపీ కోసం ప్రత్యేక రైలు నడపడం, విఐపి మర్యాదలు చేయాలని రైల్వేల చట్టంలో ఎక్కడా లేదు. అయినప్పటికీ దివంగత బిజెపి నేత ప్రమోద్ మహాజన్ కుమార్తె పూనం మహాజన్ కోసం ఆ రూట్లో తిరిగే రైళ్లంటినీ ఆపేసి మరీ ఆమె కోసం ప్రత్యేక రైలు నడిపారని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ముంబ యి ఎంపీ 90 నిముషాల ప్రయాణం కోసం అధికారులు ఈ ‘ప్రత్యే క ఏర్పాట్లు’ చేశారు. అలాంటిదేమీ లేదని పశ్చిమ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రమేష్ చంద్ర సుదీర్ఘ వివరణే ఇచ్చారు. సాగర్ జిల్లాలో ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా కోసం ప్రత్యేక రైలు ఏర్పాటు చేసినట్టు జిఎం చెప్పారు. ప్రొటోకాల్ ప్రకారమే ఈ ఏర్పాట్లు చేశామన్నారు. అదే కార్యక్రమానికి ఎంపీ పూనం మహాజన్ హాజరయ్యారని తెలిపారు. మంత్రి, ఎంపీ ఇద్దరూ బినా వరకూ ప్రత్యేక రైలులోనే ప్రయాణించారని ఆయన అన్నారు. సమీపంలో రైల్వే ఓవర్ బ్రిడ్జిని మంత్రి ప్రారంభించినట్టు జిఎం వెల్లడించారు. ‘ ఆ కార్యక్రమం ముగిసిన తరువాత భోపాల్ వెళ్లి అక్కడ నుంచి ఢిల్లీ విమానంలో చేరుకోవాలన్నది మంత్రి పర్యటన షెడ్యూల్. అయితే ప్రారంభోత్సవ కార్యక్రమం ఆలస్యం కావడంతో ప్రయాణంలో స్వల్ప మార్పులు జరిగాయి’అని ఆయన పేర్కొన్నారు. మంత్రి బినా నుంచి ఢిల్లీ వెళ్లిపోయారని, ప్రత్యేక రైలు తిరిగి భోపాల్ చేరుకుందని ఆయన వివరించారు.