జాతీయ వార్తలు

జడ్జీలను నియమించాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: ఉమ్మడి హైకోర్టుతో పాటుగా దేశ వ్యాప్తంగా పూర్తిస్థాయిలో ప్రధాన న్యాయమూర్తులను నియమించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. పిటిషన్‌ను 10 వారాల తరువాత విచారణ చేపడుతామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఉమ్మడి హైకోర్టు న్యాయవాది సత్యం రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. దేశంలోని హైకోర్టుల్లో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నెలరోజులు పాటే ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈలోపు పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిని నియమించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. దేశ వ్యాప్తంగా హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులును నిమయించడంతోపాటు 392 మంది న్యాయమూర్తుల పోస్టులను భర్తీ చేయాల్సి ఉందన్నారు. తెలంగాణ ఉమ్మడి హైకోర్టులో 27 మంది న్యాయమూర్తులను భర్తీ చేయాల్సి ఉందని పిటిషనర్ స్పష్టం చేశారు.