జాతీయ వార్తలు

మాదక ద్రవ్యాల కేసు వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: హైదరాబాద్‌లో ఇటీవల సంచలనం సృష్టించిన మాదక ద్రవ్యాల కేసు విచారణ వాయిదా పడింది. విద్యా సంస్థల్లో మాదక ద్రవ్యాల వినియోగం, ప్రభావాలపై కోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన నిపుణులతో కూడిన కమిటీ నివేదిక ఫిబ్రవరి నెలలోగా అందజేస్తామని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. హైదరాబాద్‌లో ఇటీవల మాదకద్రవ్యాల పెద్ద మొత్తంలో లభ్యం కావడం, ఈ కేసులో సినీ ప్రముఖలు, ఇతరుల ప్రమేయంపై సీబీఐ విచారణ జరిపించాలంటూ కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం నాడు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. దీనిపై కేంద్రం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ మణిందర్‌సింగ్ వాదనలు వినిపించారు. విద్యా సంస్థల్లో మాదక ద్రవ్యాల వినియోగంపై అధ్యయనం చేసేందుకు నిపుణులతో కూడిన కమిటీ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. కమిటీ నివేదిక ఫిబ్రవరిలో అందజేస్తామన్నారు. అలాగే మాదక ద్రవ్యాల ప్రభావం, దానిపై తీసుకోవాల్సిన చర్యలపై ఎయిమ్స్ కూడా అధ్యయనం చేస్తోందని ఆయన అన్నారు. ఆ నివేదిక మార్చినాటికి దాఖలు చేస్తామన్నారు. దీంతో ధర్మాసనం ఈ కేసును ఫిబ్రవరి నెలలో విచారణ చేపడుతామని వెల్లడించింది. పిటిషనర్ తరపున న్యాయవాది శ్రావణ్‌కుమార్ హాజరయ్యారు.