జాతీయ వార్తలు

పేదరికాన్ని తరిమేద్దాం..చేతులు కలపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలాసోర్ (ఒడిశా), జూన్ 2: దేశాన్ని పేదరికం నుంచి విముక్తి చేయటంలో ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. రెండేళ్ల పరిపాలన పూర్తయిన సందర్భంగా గురువారం బాలాసోర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. దేశంలో బిజెపి పాలిత రాష్ట్రాలన్నింటిలోనూ అభివృద్ధే ప్రధాన చర్చనీయాంశమైందన్నారు. తాను అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే పేదరిక నిర్మూలనకు అవసరమైన పథకాలను రూపొందించాలని నిర్ణయించుకున్నానని ఆయన వివరించారు. ‘పార్లమెంట్‌లో నా మొదటి ప్రసంగంలోనే పేదల సంక్షేమం కోసమే నా ప్రభుత్వం అంకితమవుతుందని ప్రకటించాను నేను ప్రధానమంత్రిని కానని.. ప్రధాన సేవకుడినని తెలిపాను..నేను ప్రజలకు జవాబుదారుణ్ణి’ అని మోదీ స్పష్టం చేశారు. ‘ప్రభుత్వం చిత్తశుద్ధిని ప్రజలు గ్రహించినప్పుడే ఈ పథకాన్నైనా విజయవంతంగా అమలు చేసే దిశలో ప్రభుత్వం ముందుకు వెళ్లేందుకు వీలవుతుంది. ప్రజలు-ప్రభుత్వ భాగస్వామ్యంతో పేదరికంపై మనం పోరాడాలి. అందుకోసమే ప్రజలకు సాధికారత కల్పించే దిశగా మేం చర్యలు తీసుకుంటున్నాం. ఒక సమతుల్యమైన మార్గంలో అభివృద్ధి జరిగితేనే అన్ని రాష్ట్రాలు ముందడుగు వేస్తాయి.’ అని మోదీ పేర్కొన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధి వేగంగా జరుగుతోందని.. ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి భిన్నంగా ఉందని మోదీ వ్యాఖ్యానించారు. దేశానికి తూర్పున ఉన్న రాష్ట్రాలు ఒడిషా, బెంగాల్, తూర్పు యూపీ, అస్సాం వంటి రాష్ట్రాలు ఎందుకు వెనుకబడ్డాయో ఒకసారి ఆలోచించాలని ఆయన అన్నారు.
భారతదేశంలోని పేదలు తాము తీసుకున్న రుణాలను తిరిగి బ్యాంకులకు చెల్లించటం వారి పేదరికంలోని సంపన్నతను తెలియజేస్తుందని మోదీ అన్నారు. ప్రధానమంత్రి ముద్రా యోజన కింద రూ.50వేల నుంచి రూ.10లక్షల వరకు ఎలాంటి ష్యూరిటీ లేకుండా దాదాపు 3.5కోట్ల కుటుంబాలు బ్యాంకుల నుంచి రుణాలు పొందాయని, వారిలో కొందరు తాము తీసుకున్న రుణాలను తిరిగి చెల్లిస్తున్నారని, అదే వారి గొప్పతనమని మోదీ అన్నారు.
మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఇచ్చిన గరీబీ హఠావో నినాదాన్ని 40-50 ఏళ్ల క్రితం మనం విన్నామని ప్రధానమంత్రి అన్నారు. ఆ నినాదం ఉద్దేశం మంచిదే కావచ్చు కానీ, అది తప్పుడు మార్గంలో వెళ్లటం వల్ల విఫల నినాదంగా మారిందన్నారు. ఏ ఒక శాతమైనా అది సత్ఫలితాల్ని సాధించలేకపోయిందని మోదీ ఆరోపించారు. నినాదం ఎవరిచ్చారన్నది ముఖ్యం కాదు, అది ఎంతవరకు విజయం సాధించిందనేదే ప్రధానం అని ఆయన అన్నారు. దేశానికి పేదరికం, నిరుద్యోగం అంటురోగాలుగా మారాయని అన్నారు.

చిత్రం ఒడిశాలోని బాలాసోర్‌లో గురువారం ఏర్పాటు చేసిన
బహిరంగ సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ