జాతీయ వార్తలు

గుజరాత్ భవితపై వ్యూహం లేని మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంజార్ (గుజరాత్), డిసెంబర్ 5: ‘ఎంతసేపూ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీని విమర్శించడం తప్ప, గుజరాత్ భవిత విషయమై ప్రధాని మోదీ వద్ద ఎలాంటి వ్యూహం లేదు..’ అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన మంగళవారం కచ్ జిల్లాలో పలు చోట్ల బహిరంగ సభల్లో మాట్లాడుతూ మోదీపై విమర్శలు సంధించారు. గుజరాత్‌కు ‘బంగారు భవిష్యత్’ ఉండేలా కాంగ్రెస్ కృషి చేస్తుందని ఆయన హామీ ఇస్తూ, ఈ రాష్ట్రంలో తాము అధికారం చేపడితే ‘గబ్బర్ సింగ్ టాక్స్’ (జిఎస్‌టి), నోట్లరద్దు వంటి నిర్ణయాలను తీసుకోబోమని వ్యంగ్యంగా అన్నారు. కాంగ్రెస్‌పై ఆరోపణలు చేయడమే మోదీ ప్రసంగాల లక్ష్యంగా కనపిస్తోందని, ఈ ఎన్నికలు రెండు పార్టీల మధ్య లేదా ఇద్దరు వ్యక్తుల మధ్య కాదని అన్నారు. గుజరాత్ ప్రజల భవిష్యత్‌ను నిర్ణయించే ఈ ఎన్నికలు అత్యంత కీలకమైనవని కాంగ్రెస్ భావిస్తుండగా, ఈ రాష్ట్రం భవిష్యత్ గురించి మోదీ ఎక్కడా మాట్లడడం లేదన్నారు. బీజేపీ నాయకత్వం భవిష్యత్‌లో ఏం చేయాలనుకుంటుందో ప్రజలు గమనించాలన్నారు. ‘మోదీ ముద్ర’ చెరిగిపోవడం వల్లనే గుజరాత్ భవిత గురించి ప్రధాని ఎక్కడా మాట్లాడడం లేదని రాహుల్ ఆరోపించారు. గుజరాత్‌లో బీజేపీ 22 ఏళ్ల పాలన కొద్దిరోజుల్లో అంతం కానున్నదని తెలిశాకే మోదీ తన ప్రసంగాల్లో అరవై శాతం మేరకు కాంగ్రెస్ గురించే మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. ప్రజల ప్రాధాన్యతలు, ఆమోదం మేరకే తాము నిర్ణయాలు తీసుకుంటామన్నారు. అన్ని వర్గాల వారిని దృష్టిలో ఉంచుకునే కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించామన్నారు.
‘మిత్రులైన’ కొందరు పారిశ్రామికవేత్తలకు నరేంద్ర మోదీ అత్యంత ఉదారంగా భూములను, విద్యుత్‌ను దానం చేస్తున్నారని ఆరోపించారు. అవినీతి గురించి గొప్పగా మాట్లాడే మోదీ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కుమారుడి అక్రమ సంపాదన గురించి ఎందుకు ప్రస్తావించడం లేదని రాహుల్ నిలదీశారు. గుజరాత్ గురించి, ఈ దేశం గురించి ఆలోచిస్తే ఎన్నో ప్రశ్నలు మన ముందు కదలాడుతాయని, వాటికి సమాధానం చెప్పే సత్తా బీజేపీ నేతలకు లేదన్నారు.