జాతీయ వార్తలు

20న నింగిలోకి పిఎస్‌ఎల్‌వి-సి 34

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, జూన్ 2: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో భారీ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఇటీవల కాలంలో ఇస్రో ప్రతి ప్రయోగాన్ని ఏదో ఒక కొత్తదనంతో చేపట్టేందుకు సన్నాహం చేస్తోంది. ఈసారి ఒకేసారి 22 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపేందుకు సన్నద్ధమయింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు సైతం షార్‌లో శాస్తవ్రేత్తలు చురుకుగా చేస్తున్నారు. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)నుండి ఈ నెల 20న పిఎస్‌ఎల్‌వి-సి 34 రాకెట్ ప్రయోగం జరగనుంది.
ఈ రాకెట్ ద్వారా మన దేశానికి చెందిన కార్టోశాట్-2సి ఉపగ్రహంతో పాటు అమెరికా, జర్మనీ, ఇండోనేసియా, రష్యా దేశాలకు చెందిన 4మైక్రోవేవ్, 17నానో ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇందులో చెన్నైకి చెందిన సత్యభామ యూనివర్శిటి ఇంజినీరింగ్ విద్యార్థులు రూపొందించిన రెండు చిన్న ఉపగ్రహాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే విదేశాలకు చెందిన ఉపగ్రహాలు షార్‌కు చేరుకున్నాయి. ఈ ఉపగ్రహాలను షార్‌లోని ఉపగ్రహాలను శుభ్రపరిచే భవనంలో శుభ్రపరచి తుది పరీక్షలు చేస్తున్నారు. మన దేశానికి చెందిన కార్టోశాట్ ఉపగ్రహాన్ని ఈ నెల 4న శనివారం బెంగళూరులోని ఉపగ్రహ తయారీ కేంద్రం నుండి భారీ భద్రత నడుమ షార్‌కు తీసుకురానున్నారు. ఇప్పటికే రాకెట్ మూడు దశల అనుసంధాన పనులు పూర్తయ్యాయి. నాలుగో దశ అనుసంధాన పనులు పూర్తిచేసి రాకెట్ చివరి భాగంలో ఉపగ్రహాలను అమర్చనున్నారు. ఇప్పటి వరకు ఇస్రో 2009లో చంద్రయాన్ ద్వారా ఒకేసారి 10 ఉపగ్రహాలను నింగిలోకి పంపి విజయవంతం చేశారు. ఈసారి 22 ఉపగ్రహాలను పంపించేందుకు శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు అమెరికా మాత్రమే 29 ఉపగ్రహాలను ఒకేసారి ప్రయోగించి ఉన్నారు. ఈ ప్రయోగం జరిగితే భారత్ అధిక సంఖ్యలో ఉపగ్రహాలు పంపిన రెండో దేశంగా నిలవనుంది. ఈ ప్రయోగానికి సంబంధించిన ఎం ఆర్ ఆర్ సమావేశం ఈ నెల 10లేదా 11వ తేదీన షార్‌లో జరగనుంది. అన్ని సజావుగా సాగి వాతావరణం అనుకూలిస్తే ఈ నెల 20న షార్‌లోని రెండోప్రయోగ వేదిక నుండి పిఎస్‌ఎల్‌వి-సి 34రాకెట్ నింగిలోకి ఎగరనుంది.