జాతీయ వార్తలు

8 మంది ఉగ్రవాదులకు జీవిత ఖైదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, డిసెంబర్ 6: పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబాకు చెందిన ఎనిమిది మంది ఉగ్రవాదులకు రాజస్థాన్ కోర్టు జీవిత ఖైదు విధించింది. శిక్షపడ్డవారిలో ముగ్గురు పాకిస్తాన్ జాతీయులున్నారు. ఎనిమిది మంది ఉగ్రవాదులను 2010-11లో రాజస్థాన్ యాంటీ టెర్రరిస్టు పోలీసులు అరెస్టు చేశారు. ఆరేళ్లపాటు విచారణ తరువాత బుధవారం వారందరికీ శిక్ష వేస్తూ కోర్టు తీర్పును వెలువరించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద దోషులకు జీవిత ఖైదుతోపాటు ఒక్కొక్కరికి మూడేసి లక్షల రూపాయల జరిమానా విధిస్తూ జైపూర్ అదనపుజిల్లా, సెషన్స్ కోర్టు తీర్పును ఇచ్చిందని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ మహావీర్ జిందాల్ వెల్లడించారు. సెక్షన్ 13 (చట్టవ్యతిరేక కార్యకలాపాలు), సెక్షన్ 18(బి) (ఉగ్రవాద సంస్థలోకి రిక్రూట్‌మెంట్లు), సెక్షన్ 18 (కుట్ర), సెక్షన్ 20 (ఉగ్రవాద సంస్థలో భాగస్వామ్యం) కింద ఎనిమిది మందిని కోర్టు దోషులుగా తేల్చింది. పాకిస్తానీ లష్కరే ఉగ్రవాది అస్గర్ అలీ, షక్కర్ ఉల్లా, షాహిద్ ఇక్బల్ జాతి వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహించడంతోపాటు రిక్రూట్‌మెంట్లు నిర్వహించేవారు. ఈ ముగ్గురితోపాటు ఐదుగురికి కోర్టు శిక్షలు విధించింది. బాబు అలియాస్ నిషాచంద్ అలీ, హఫీజ్ అబ్దుల్, పవన్ పూరి, అరుణ్ జైన్, కబిల్, జిందాల్‌లకు జీవితఖైదు పడింది. బాబు, పవన్ పూరి బీకనెర్ జైలులో ఉన్న అస్గర్ జైలులో కలిసి కుట్ర పన్నారు. మొత్తం ఐదుగురు సభ్యులకు పాకిస్తాన్ లష్కరే తోయిబా కమాండర్‌తో సంబంధాలుండేవని, మొబైల్ ఫోన్లో సంప్రదింపులు జరుపుతుండేవారని కోర్టు నిర్ధారించింది. కేంద్ర నిఘావర్గాల సమాచారం మేరకు రాజస్థాన్ ఏటీఎస్ పోలీసులు అప్రమత్తమయ్యారు. లష్కరే తోయిబా కమాండర్‌తో ఫోన్ సంభాషణలపై నిఘా పెట్టిన వారిని అదుపులోకి తీసుకున్నారు.