జాతీయ వార్తలు

నన్ను ‘తొలగించాలనుకున్నారు’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భాభార్ (గుజరాత్), డిసెంబర్ 8: కాంగ్రెస్ నుంచి సస్పెండైన మణిశంకర్ అయ్యర్‌పై ప్రధాని నరేంద్రమోదీ రెండోరోజుకూడా మరిన్ని తీవ్ర ఆరోపణలతో ధ్వజమెత్తారు. తాను పాకిస్తాన్ పర్యటనలో ఉండగా తనను ‘తొలగించడానికి’ మణిశంకర్ సుపారీ (కాంట్రాక్ట్) ఇచ్చారని మోదీ ఆరోపించారు. దారిలోనే తనను తొలగించడం ద్వారా భారత్-పాకిస్తాన్ మధ్య శాంతి స్థాపనకు ప్రయత్నించారని ఆయన అన్నారు. తనను నీచుడిగా అభివర్ణిస్తూ మణిశంకర్ అయ్యర్ గురువారం చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో శుక్రవారం మరింత తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. తనను నీచుడిగా అభివర్ణిస్తూ తిట్టడం కాంగ్రెస్‌కు ఇదే మొదటిసారి కాదని పేర్కొన్న ఆయన తనను కుక్కతోనూ, రావణుడితోనూ, హిట్లర్‌తోనూ పోల్చారని మోదీ గుర్తుచేశారు. తాను పేద కుటుంబంలో పుట్టడం వల్లే నీచుడ్ని అయ్యానా అని ప్రశ్నించారు. అయ్యర్ తనపై చేసిన కుట్రను కాంగ్రెస్ పార్టీ కప్పిపుచ్చిందని ఆయనపై ఎలాంటి చర్య తీసుకోలేదని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పనితీరును దుయ్యబట్టిన మోదీ‘ అటక్‌నా (అడ్డుకోవడం) లటక్‌నా (ఒక అంశాన్ని పదేపదే చెప్పడం) భటక్‌నా (దాటవేయడం)’ ఇవి కాంగ్రెస్ పార్టీ లక్షణాలని మోదీ అన్నారు. మోదీ నీచుడు అంటూ పరుష వ్యాఖ్యలు చేసినందుకు మణిశంకర్ అయ్యర్‌ను కాంగ్రెస్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఉత్తర గుజరాత్‌లోని బనస్కంటా జిల్లాలోని ఈ చిన్నపట్టణంలో జరిగిన సభలో మాట్లాడిన మోదీ ‘మణిశంకర్ అయ్యర్ ఏమన్నాడో మీకు తెలుసా?’అని సభికులను ఉద్దేశించి అడిగారు. అలాగే మణిశంకర్ తిట్టింది ‘మిమ్మల్నా.. నన్నా’ అని ప్రశ్నించారు. ఆయన ‘నన్ను విమర్శించారా? గుజరాత్‌ను విమర్శించారా?’ అని మరోప్రశ్న వేశారు. మణిశంకర్ అయ్యర్ మాటల గురించి పట్టించుకోవల్సిన అవసరం లేదన్న ప్రధాని రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి ఎలా బుద్ధి చెప్పాలో తెలుసన్నారు. ఈ నెల 18న ఫలితాలతో ఆ పార్టీకి అసలు పరిస్థితి అర్థమవుతుందని చెప్పారు. తాను ప్రధాన మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరవాత అయ్యర్ పాకిస్తాన్ వెళ్లి కొందరు వ్యక్తులు కలుసుకున్నారని, ఈ వ్యవహారమంతా సోషల్ మీడియాలో వెలుగుచూసిందని చెప్పారు. ‘పాకిస్తానీయులతో జరిపిన సమావేశంలో మాట్లాడిన మణిశంకర్, మోదీని తొలగించనంతవరకూ భారత్-పాకిస్తాన్ మధ్య పరిస్థితి మెరుగుకాదు’ అని అన్నట్టుగా తెలిసిందని మోదీ ఈ సభలో తెలిపారు.
ఎవరెన్ని కుట్రలు పన్నినా అంబేమాత తనను రక్షిస్తుందని ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మోదీ అన్నారు. మూడేళ్ల క్రితమే కొందరు పాకిస్తానీయులతో మణిశంకర్ సమావేశమయ్యారని ఆ వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ వెలుగుచూడనీయలేదని ఆరోపించారు. ‘నన్ను తొలగించాలని కుట్ర పన్నడానికి’ తాను చేసిన నేరం ఏమిటని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో దేశ ప్రజలు తనను ప్రధానిగా ఎన్నుకున్నారని అలాంటప్పుడు ‘మీరు పాకిస్తాన్‌కు వెళ్లి నన్ను తొలగించాలి చెబుతారు’ అని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి అన్నారు.

చిత్రం..గాంధీనగర్‌లో శనివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ