జాతీయ వార్తలు

మేజర్‌గానే విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 4: ఢిల్లీలో మెర్సిడెస్ కారుతో ఢీకొట్టి ఒకరి మృతికి కారణమైన టీనేజర్‌ను మైనారిటీ తీరిన వ్యక్తిగానే పరిగణించి విచారించాలని జువెనైల్ జస్టిస్ బోర్డ్ (జెజెబి) శనివారం నిర్ణయించింది. ఈ టీనేజర్ చేసిన నేరం క్రూరమయిందని కూడా పేర్కొంది. ఒక నేరానికి పాల్పడిన మైనర్‌ను మేజర్‌గా భావించి విచారించడం దేశంలో ఇదే మొదటిసారి. ఏప్రిల్ 4న ఢిల్లీలో ఒక టీనేజర్ తన తండ్రికి చెందిన మెర్సిడెస్ కారును వేగంగా నడుపుతూ ఒక వ్యక్తిని ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయిన విషయం తెలిసిందే. మెర్సిడెస్ కారు ఢీకొనడంతో 32 ఏళ్ల ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అయితే ఈ నేరం జరిగిన నాలుగు రోజులకే సదరు టీనేజర్ మేజర్ అయ్యాడు. నేరానికి పాల్పడిన నాలుగు రోజులకే మేజర్ అయిన నిందితుడిని మేజర్‌గా భావించి విచారించడానికి కేసును ట్రయల్ కోర్టుకు బదిలీ చేయాలని ఢిల్లీ పోలీసులు చేసిన అభ్యర్థనను జెజెబి ప్రిసైడింగ్ అధికారి శనివారం ఆమోదించారు. పిల్లలు క్రూరమైన నేరాలకు పాల్పడితే ఆ కేసులను సెషన్స్ కోర్టుకు బదిలీ చేయడానికి జువెనైల్ జస్టిస్ బోర్డ్‌కు వీలు కల్పిస్తూ జువెనైల్ జస్టిస్ (కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్) యాక్ట్-2015కు సవరణలు చేసిన తరువాత ఈ తరహాలో కేసు బదిలీ చేయడం ఇదే మొదటిసారి.