జాతీయ వార్తలు

రూ.50 లక్షలకు పరిహారం పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, జూన్ 4: ఉత్తరప్రదేశ్‌లోని మధురలో భూకబ్జాదారుల దాడి లో మృతి చెందిన ఇద్దరు పోలీసు అధికారుల కుటుంబాలకు చెల్లించే నష్టపరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూ. 20 లక్షల నుంచి రూ. 50 లక్షలకు పెంచింది. విధి నిర్వహణలో అమరులయిన మధుర పోలీసు సూపరింటెండెంట్ (ఎస్‌పి) ముకుల్ ద్వివేది, స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఒ) సంతోశ్ కుమార్ కుటుంబాల్లో ఒక్కొక్కరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని, ఆ కుటుంబాలకు పింఛను మంజూరు చేస్తామని కూడా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ శనివారం ప్రకటించారు. అమరులయిన ఇద్దరు పోలీసు అధికారుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ రెండు కుటుంబాలకు పూడ్చలేని లోటు కలిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా, మధుర ఘర్షణలకు రాష్ట్ర మంత్రి, ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ మామ అయిన శివపాల్ యాదవ్ బాధ్యుడని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా శనివారం ఆరోపించారు. శివపాల్ యాదవ్ వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

చిత్రం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఎకె అసాల్ట్ రైఫిళ్లు పట్టుకున్న ఇద్దరు ఉగ్రవాదుల ఫొటో ఇది. జమ్మూకాశ్మీర్‌లోని అనంతనాగ్‌లో శనివారం ఇద్దరు పోలీసులను కాల్చిచంపింది వీరేనని భావిస్తున్నారు.