జాతీయ వార్తలు

అమర్‌నాథ్ గుహలో భజనలపై నిషేధం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 14: హిమాలయాల్లోని అమర్‌నాథ్ గుహలో భక్తులు మంత్రాలను పఠించడం, భజనలు చేయడంపై తాము ఎలాంటి నిషేధం విధించలేదని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) గురువారం వివరణ ఇచ్చింది. అమర్‌నాథ్ గుహను ‘శబ్దరహిత జోన్’గా పరిగణించడంపై భక్తుల నుంచి నిరసనలు వ్యక్తం కావడంతో ట్రిబ్యునల్ ఈ వివరణ ఇచ్చింది. గుహలోని మంచు శివలింగం ఎదురుగా నిలబడినపుడు మాత్రం భక్తులు వౌనంగా ఉండాలని తాము నిబంధన విధించినట్లు ఎన్‌జీటీ చైర్‌పర్సన్ జస్టిస్ స్వతంతర్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. మెట్ల మార్గంలో, గుహకు వెళ్లేదారిలో ఈ నిబంధనలు వర్తించవని, మంచు లింగం వద్ద ప్రశాంతత ఉండాలన్న ఉద్దేశంతోనే తాము ఆదేశాలు జారీ చేశామని ట్రిబ్యునల్ తెలిపింది. పవిత్ర గుహకు వెళ్లే మార్గంలో 30 మెట్లు ఉన్నాయని, గుహ వద్దకు నడచి వెళ్లే ప్రాంతంలో ఎలాంటి ఆంక్షలు లేవని పేర్కొంది. మంచు విగ్రహం ఉన్న ప్రాంతంలో ప్రశాంతత, పవిత్రతను కాపాడేందుకు అక్కడ భక్తులు వౌనంగా ఉండాలని తెలిపింది. నిబంధనలను పాటించేలా చర్యలు తీసుకోవాలని పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖకు, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, అమర్‌నాథ్ ఆలయ బోర్డుకు, స్థానిక అధికారులకు ఎన్‌జీటీ ఆదేశాలు పంపింది.