జాతీయ వార్తలు

18వ తేదీకి లోక్‌సభ వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: దివంగత నేతలకు సంతాపం వ్యక్తం చేయడానికే తొలిరోజు లోక్‌సభ సమావేశాలు పరిమితమయ్యాయి. ముగ్గురు ప్రస్తుత సభ్యులు సుల్తాన్ అహమద్ (ఉలుబోరియా- పశ్చిమ బెంగాల్), చాంద్‌నాథ్ (ఆల్వర్-రాజస్థాన్), తస్లీం ఉద్దీన్ (ఆరియా-బిహార్)తోపాటు ఏడుగురు మాజీ సభ్యుల మరణం పట్ల సంతాపం తెలిపిన అనంతరం లోక్‌సభ సోమవారానికి వాయిదా పడింది. శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు వందేమాతరం గానంతో లోక్‌సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలుత స్పీకర్ సుమిత్రా మహాజన్ ఇటీవల ఎంపీగా గెలిచిన సునీల్ కుమార్ జాఖడ్ చేత ప్రమాణం చేయించారు. అనంతరం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొత్త మంత్రులను సభకు పరిచయం చేశారు. స్పీకర్ సుమిత్రా మహాజన్ లోక్‌సభ కొత్త సెక్రటరీ జనరల్ స్నేహలతా శ్రీవాత్సవను సభ్యులకు పరిచయం చేశారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత మొదటి సారి లోక్‌సభ సెక్రటరీ జనరల్‌గా ఒక మహిళ నియమితులయ్యారని స్పీకర్ తెలిపారు. సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన స్నేహలతా శ్రీవాత్సవ సేవలు సభకు ప్రయోజనకరంగా ఉండగలవన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. సభ్యులంతా కరతాళ ధ్వనులతో స్నేహలతా శ్రీవాత్సవకు స్వాగతం చెప్పారు. ఆ తర్వాత సంతాపం తెలిపే కార్యక్రమాన్ని స్పీకర్ చేపట్టారు. ఇటీవలి కాలంలో దివంగతులైన ప్రస్తుత, మాజీ సభ్యులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ వౌనం వహించిన అనంతరం సభను సోమవారానికి వాయిదా వేశారు.