జాతీయ వార్తలు

రాజ్యసభలో బలం పుంజుకున్న ఎన్డీయే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 4: రాజ్యసభకు జరిగిన ద్వైవార్షిక ఎన్నికల్లో ఎన్‌డిఏ బలం పెద్దగా పెరగకపోయినా మొదటిసారి సభలో యుపిఏ కంటే బిజెపి మిత్రపక్షాల సభ్యుల సంఖ్య అధికం అయింది. రాజ్యసభలో యుపిఏ మిత్ర పక్షాల సంఖ్య 70 ఉంటే ఎన్‌డిఏ మిత్రపక్షాల సభ్యుల సంఖ్య 76కు చేరుకుంటోంది. అయితే రాజ్యసభలో కాంగ్రెస్ 60 మంది సభ్యులతో అతిపెద్ద పార్టీగా ఉంటుంది. రాజ్యసభలో ఎన్‌డిఏ బలం 76కు చేరుకున్నా బిల్లులకు సభ ముద్ర వేయించుకునేందుకు ఇతర భావ సారూప్యత గల పార్టీల మద్దతు తీసుకోకతప్పటం లేదు. బిజెపి ఆసోంలో అధికారంలోకి వచ్చినా ఆ రాష్ట్రంలో రాజ్యసభ సీట్లు 2019లో మాత్రమే ఖాళీ అవుతున్నందున బిజెపికి ఒరిగేది ఏదీలేదు. రాజ్యసభకు ఆంధ్రా, తెలంగాణ, తమిళనాడు, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, బిహార్, మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలో ఏర్పడిన 57 ఖాళీలను భర్తీ చేసేందుకు జరిగిన ఎన్నికల్లో బిజెపికి అదనంగా నాలుగు సీట్లు రానున్నాయి. బిజెపికి చెందిన పధ్నాలుగు మంది సభ్యులు పదవీ విరమణ చేస్తే 18 మంది ఎన్నికవుతున్నారు. తెలుగుదేశం పార్టీకి అదనంగా మరో రెండు సీట్లు రావటం కూడా బిజెపికి కలిసివస్తోంది. తమిళనాడులో ఏర్పడిన ఆరు ఖాళీలను భర్తీచేయటంలో అన్నా డి.ఎం.కెకు చెందిన మూడు సీట్లతో పాటు కాంగ్రెస్ ఖాళీచేసిన సీటుకూడా వారికే దక్కటంతో బిజెపికి ఇక్కడ మరోసీటు కలిసివస్తోంది. డిఎంకె తన మూడు సీట్లను నిలబెట్టుకున్నది. పశ్చిమ బెంగాల్, కేరళలో కూడా రాజ్యసభ సీట్లు వచ్చే సంవత్సరం ఖాళీ అవుతున్నాయి. రాజ్యసభలో కాంగ్రెస్ బలం సంఖ్యాపరంగా పెరగకపోయినా సీనియర్ నాయకుల సంఖ్యమాత్రం బాగా పెరుగుతోంది. తమిళనాడుకు చెందిన సీనియర్ నాయకుడు, ఆర్థిఖ శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం మహారాష్ట్ర నుండి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరో సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ ఉత్తర్‌ప్రదేశ్ నుండి పోటీలో ఉన్నారు. ఇదిలావుంటే ప్రముఖ న్యాయవాది రాంజెత్మలానీ ఆర్‌జెడి టికెట్‌పై బిహార్ నుండి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆర్‌జెడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు మీసా భారతి, జెడి (యు) అధినాయకుడు శరద్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 57 మందిలో మొత్తం 26 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు రంగంలో ఉన్న రాజస్తాన్, కపిల్ సిబల్ పోటీ చేస్తున్న ఉత్తరప్రదేశ్‌లో మాత్రం ఈ నెల 11నఎన్నికలు జరుగనున్నాయి.

చిత్రం పాట్నాలో శనివారం బిహార్ సిఎం నితీశ్ కుమార్, రాజ్యసభకు కొత్తగా ఎన్నికయిన శరద్ యాదవ్, ఆర్‌సి సింగ్‌ను గజమాలతో సత్కరిస్తున్న జెడియుకు చెందిన ముస్లిం మద్దతుదారులు