జాతీయ వార్తలు

సోనియా రాజకీయాలను వీడరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అధ్యక్ష పదవి నుంచి రిటైరవుతున్నారే తప్ప క్రియాశీల రాజకీయాల నుంచి వైదొలగడం లేదని పార్టీ అధికార ప్రతినిధి రణదీప్‌సింగ్ సుర్జేవాలా స్పష్టం చేశారు. సోనియా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారంటూ మీడియాలో వచ్చిన వార్తలపై కాంగ్రెస్ స్పందించింది. సోనియా గాంధీ శుక్రవారం పార్లమెంటు ఆవరణలో విలేఖరులతో మాట్లాడుతూ రిటైర్ కావడమే ఇప్పుడు తన పాత్ర అంటూ వ్యాఖ్యానించారు. ‘పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇక మీదట మీ పాత్ర ఎలా ఉంటుంది?’అని విలేఖరులు సోనియా గాంధీని అడిగారు. దీనికి ఆమె ‘ రిటైరవుతున్నా’అని బదులిచ్చారు. సోనియా గాంధీ ప్రకటన కాంగ్రెస్ వర్గాలు ముఖ్యంగా సీనియర్ నాయకుల గుండెల్లో గుబులు పుట్టించింది.
సోనియా రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నారనే సందేశం వెళితే కాంగ్రెస్‌కు తీరని నష్టం వాటిల్లుతుందన్నది వారి ఆందోళన. అంతేకాదు ఆమె ఇప్పటికిప్పుడే క్రియాశీల రాజకీయాల నుంచి వైదొలిగితే పార్టీతోపాటు సీనియర్ నాయకులకు నష్టం కలుగుతుందన్నది వారి అభిప్రాయం. దీంతో వెంటనే సుర్జేవాలా రంగంలోకి దిగారు. నష్టనివారణపై స్పందించారు. రిటైరవుతున్నట్టు సోనియా గాందీ చెప్పిన కొన్ని నిమిషాలకే రణదీప్‌సింగ్ సుర్జేవాల్ విలేఖరులను కలిసి వివరణ ఇచ్చారు. ‘సోనియా గాంధీ కేవలం కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచే తప్పుకుంటారు. అంతే తప్ప క్రియాశీల రాజకీయాల్లోనే కొనసాగుతారు’అని స్పష్టం చేశారు. సోనియా క్రియాశీల రాజకీయాల్లో ఉండటంతో పాటు కాంగ్రెస్‌కు ఎప్పటికప్పుడు మార్గదర్శనం చేస్తారని ఆయన అన్నారు. దీనిపై రణదీప్ సుర్జేవాలా పరుమార్లు ట్వీట్ చేశారు.
కాగా శనివారం కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపడుతున్న రాహుల్ గాంధీ పట్ల సోనియా గాంధీకి ఉన్న మాతృ ప్రేమ శుక్రవారం కొట్టొచ్చినట్లు కనిపించింది. రాహుల్ గాంధీకి శాలువ కప్పించటం ద్వారా ఆమె తన ప్రేమను ప్రకటించుకున్నారు. కాంగ్రె స్ అధ్యక్షురాలుగా సోనియా గాందీకి శుక్రవారం ఆఖరి రోజు. ఇదే విధంగా ఉపాధ్యక్షుడుగా రాహుల్ గాంధీకి కూడా ఇదే ఆఖరి రోజు. రాహుల్ శనివారం ఉదయం 10 గంటలకు ఏఐసీసీలో పార్టీ అధ్యక్ష పదవి చేపడతారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా శుక్రవారం రాహుల్ గాంధీతో కలిసి పార్లమెంటుకు వచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు ఎంఏ ఖాన్ పార్లమెంటు గేటు వద్ద సోనియా గాంధీకి శాలువ కప్పి స్వాగతం చెప్పారు. ఖాన్ ఆమెకు శాలువ కప్పి పక్కకు తప్పుకోగానే సోనియా గాంధీ తన పక్కన ఉన్న రాహుల్ గాంధీని చూపిస్తూ ఆయనకు శాలువ కప్పరా? అనేశారు. దీనికి ఖాన్ స్పందిస్తూ ఆయననూ కూడా శాలువతో సన్నానిస్తున్నామంటూ ముందుకు వెళ్లి రాహుల్ గాంధీకి శాలువ కప్పి సన్మానించారు. రాహుల్ గాంధీ ఎంఏ ఖాన్‌ను ఆలింగనం చేసుకుని ధన్యవాదాలు తెలిపారు. మరో రాజ్యసభ సభ్యుడు రాజీవ్ శుక్లా ఇరువురు అగ్రనాయకులకు పుష్పగుచ్ఛాలు సమర్పించి స్వాగతం పలికారు.