జాతీయ వార్తలు

ఎన్డీయేది ప్రచార ఆర్భాటమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, జూన్ 4: కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానిది ప్రచార ఆర్భాటమే తప్ప ప్రజలకు మేలు జరిగింది శూన్యమేనని బిఎస్‌పి అధినేత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి విమర్శలు గుప్పించారు. పనిలో పనిగా ఆమె యుపి సిఎం అఖిలేష్ యాదవ్‌ను విడిచిపెట్టలేదు. శనివారం లక్నోలో మాయావతి విలేఖరులతో మాట్లాడుతూ మధురలో జరిగిన మారణకాండపై సిబిఐ లేదా న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి అఖిలేష్, అంతగొడవ జరిగిన మధురకు వెళ్లకుండా బుందేల్‌ఖండ్‌లో పర్యటించడమేమిటని, మధురలో జరిగిన మారణకాండ ఆయనకు పట్టినట్లు లేదని విమర్శించారు.
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా వేడుకలు నిర్వహించడాన్ని మాయా తప్పుబట్టారు. బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వ హయాంలో ‘అచ్చేదిన్’ పోయి ‘బురాదిన్’ వచ్చాయని అన్నారు. 2014 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ పూర్తిగా మరచిపోయారని విమర్శించారు. బిజెపికి రోజులు దగ్గరపడ్డాయని, అలాగే యుపిలోని అఖిలేష్ ప్రభుత్వం కూడా ప్రజా విశ్వాసాన్ని కోల్పోతోందని ఇక 2017లో జరగనున్న ఎన్నికల్లో తమదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. ‘సర్వజన హితే, సర్వజన సుఖే’ నిదానంతో వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తామని, యుపిలో ఎస్‌పికి ప్రయ్యామ్నాయం బిఎస్‌పియేనని అన్నారు. యుపిఏ, ఎన్డీయే ప్రభుత్వాలు ఒక నాణేనికి రెండు ముఖాలని, కాంగ్రెస్ పథకాలనే బిజెపి ప్రభుత్వం అమలు చేస్తోందని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో దళితులపై దాడులు పెరిగిపోయాయని, మొత్తంమీద ఎన్డీయే హయాంలో బడుగులపై దాడులు తీవ్రమయ్యాయని, అందుకు రోహిత్ వేముల ఉదంతమే ఉదాహరణ అని ఆమె పేర్కొన్నారు.

చిత్రం విలేఖరులతో మాట్లాడుతున్నబిఎస్‌పి అధినేత్రి మాయావతి