జాతీయ వార్తలు

బీజేపీ విజయం కష్టమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణె, డిసెంబర్ 17: ఇరవై రెండేళ్లుగా గుజరాత్ అధికార పీఠాన్ని కైవసం చేసుకుంటున్న భారతీయ జనతా పార్టీకి ఈసారి చుక్కెదురు కానుందా? అవుననే అంటున్నారు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ కకాడే. పోలింగ్ అనంతరం వెలువడిన ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ ఈసారికూడా బిజెపికి అధికారం ఖాయమని స్పష్టం చేసిన నేపథ్యంలో ఎంపి కకాడే ఆదివారం చేసిన ప్రకటన సంచలనానే్న సృష్టించింది. ‘మెజారిటీ సంగతి మరచిపోండి. కనీసం అధికారాన్ని చేపట్టేందుకు అవసరమైనన్ని సీట్లు బీజేపీకి రావడం కష్టమే. మరోపక్క కాంగ్రెస్ కూడా దరిదాపులకు మాత్రమే వస్తుంది’ అని కకాడే స్పష్టం చేశారు. అన్నింటినీ దాటుకుని అధికారాన్ని కైవసం చేసుకునేందుకు కావల్సినన్ని సీట్లు బిజెపి సాధించగలిగితే ఆ ఘనత కేవలం ప్రధాని నరేంద్ర మోదీదేనని ఆయన పేర్కొన్నారు. గుజరాత్ గ్రామీణ ప్రాంతంలో తాను సొంతంగా సర్వే చేయించాననీ, దాని ఆధారంగా తాను ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. ఆరుగురు సభ్యుల బృందాన్ని గుజరాత్‌కు పంపించాననీ, వారు గ్రామాల్లోని రైతులు, డ్రైవర్లు, రోజుకూలీల అభిప్రాయాలను సేకరించారని పేర్కొన్నారు. వారు సేకరించిన సమాచారం, తన విశే్లషణ మేరకు గుజరాత్‌లో బిజెపికి పూర్తి మెజారిటీ రావడం కష్టమేనని నిర్ణయానికి వచ్చినట్లు కకాడే వివరించారు. తాను ఈ నిర్ణయానికి రావడానికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా ఓ కారణమని చెప్పుకొచ్చారు. ‘గత 22 సంవత్సరాలుగా గుజరాత్‌లో బిజెపి అధికారంలో ఉంది. పశ్చిమ బెంగాల్‌లో కమ్యూనిస్టుల పాలన పక్కనపెడితే, స్వాతంత్య్రం సిద్ధించిన నాటినుంచి 25 ఏళ్ల పాటు ఒకే రాజకీయ పార్టీ అధికారంలో ఉన్న దాఖలాలు లేవు’ అని కకాడే గుర్తుచేశారు. పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత బీజేపీ మెజారిటీ తగ్గడానికి కారణమవుతుందన్నారు.
మలి దశ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నాయకులెవ్వరూ అభివృద్ధి గురించి ఒక్కమాట కూడా మాట్లాడలేదని, ఉపాధి అవకాశాల పెంపుపైనా ఎవరూ నోరెత్తలేదని కకాడే విమర్శించారు. రాష్ట్రంలో గత మూడేళ్ల కాలంలో ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయాలపైనా ఎవరూ ప్రజల దృష్టికి తీసుకెళ్లలేదని అన్నారు. ప్రతిపక్షమే లక్ష్యంగా విమర్శలు చేశారని, భావోద్వేగ ప్రసంగాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారని కకాడే విమర్శించారు.

చిత్రం..బీజేపీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ కకాడే