జాతీయ వార్తలు

బీజేపీ.. ఓ అబద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: బీజేపీ అబద్ధాల పుట్ట. ఆ పార్టీ పునాదులే అబద్ధాలపై నిలబడి ఉన్నాయంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పెద్దఎత్తున దాడికి దిగారు. కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం శుక్రవారం ఢిల్లీలో జరిగింది. సమావేశం అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీపై పెద్దఎత్తున మాటల దాడికి దిగారు. దేశ ప్రజలకు ప్రధాని మోదీ ఇంతవరకు చెప్పినవన్నీ అబద్ధాలేనంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ అధ్యక్షతన జరిగిన తొలి వర్కింగ్ కమిటీ భేటీకి మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాజ్యసభలో ప్రతిపక్షం నాయకుడు గులాం నబీ ఆజాద్, సోనియాగాంధీ రాజకీయ సలహాదరుడు అహ్మద్ పటేల్, రక్షణ శాఖ మాజీ మంత్రి ఆంటోనీ తదితర సీనియర్లు హాజరయ్యారు. అభివృద్ధికి సంబంధించి మోదీ మోడల్, ప్రతి పౌరుడి బ్యాంకు ఖాతాలో పదిహేను లక్షలు జమ చేస్తామంటూ ఎన్నికలకు ముందు చేసిన హామీ, పెద్ద నోట్ల రద్దు, జిఎస్టీ తదితర అన్ని పథకాలు, హామీలు, కార్యక్రమాలన్నీ అబద్ధాలేనని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. అభివృద్ధి సాకుతో గుజరాత్‌ను బీజేపీ లూటీ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు గుజరాత్ రాష్ట్రంలో అభివృద్ధి జాడేలేదని ఆరోపణలు కురిపించారు. మన ప్రధాని నరేంద్ర మోదీ మాటలు చెబుతారే తప్ప ఆచరణలో ఏదీ ఉండదని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. బీజేపీ అబద్ధాలకు మారుపేరని ఎత్తిచూపిస్తూ, ఆ పార్టీ వ్యవస్థ మొత్తం అబద్ధాల పునాధులపై నిలబడి ఉందని ఘాటు విమర్శలు చేశారు. మోదీ మోడల్.. గుజరాత్ మోడల్ అన్నవి ప్రజలను మోసం చేయడానికి ఉపయోగించే అబద్ధాలే తప్ప, అసలు గుజరాత్‌కే ఒక మోడల్ అంటూ ఏదీ లేదని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. గుజరాత్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆ రాష్ట్రంలోని ఎంతోమంది ప్రజలతో తాను ముఖాముఖి మాట్లాడానని, అభివృద్ధి అనేది మచ్చుకు కూడా లేదంటూ వచ్చిన సమాధానాలే ఎక్కువ ఉన్నాయన్నారు. అభివృద్ధి ఊసెత్తితే ప్రజలు పెదవి విరిచారు, బీజేపీ మాటల మాయతో అక్కడ వనరుల దోపిడీకి పాల్పడుతోందే తప్ప మరేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాయితీకి తానే మారుపేరని చెప్పుకునే నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కుమారుడు జై షా అవినీతి గురించి ఎందుకు మాట్లాడటం లేదని రాహుల్ గాంధీ నిలదీశారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుపై కాంగ్రెస్ చేసిన ఆరోపణలకు ప్రధాని మోదీ ఎందుకు సమాధానం చెప్పటం లేదని ప్రశ్నించారు. బీజేపీ అబద్ధాలు ఒక్కొక్కటే ఇప్పుడే వెలుగులోకి వస్తున్నాయని అన్నారు. అమిత్ షా కుమారుడు జై షా యాభై వేలతో కంపెనీ పెట్టి తన వ్యాపార చాతుర్యంతో మూడు నెలల్లో 80 కోట్లు చేశారని అంటూ, ఇది అవినీతి చాతుర్యం కాకపోతే, నిజాయితీగా వ్యాపారాన్ని చేసి ఇంతగా అభివృద్ధి చేయడం సాధ్యమా? అని ప్రశ్నించారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో కేవలం ఒక పారిశ్రామికవేత్తకు మొత్తం ప్రయోజనం కలుగుతోందని రాహుల్ విమర్శించారు. రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందాలపై తాను మూడు ప్రశ్నలు అడిగితే, నరేంద్ర మోదీ ఒక్క ప్రశ్నకూ ఇంతవరకు సమాధానం చెప్పలేదన్నారు. 2జీ కుంభకోణంపై సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ తరఫున రాహుల్ సంతృప్తి వ్యక్తం చేశారు. యూపీఏ సంకీర్ణ ప్రభుత్వం ఎలాంటి తప్పూ చేయలేదన్న విషయాన్ని ప్రత్యేక కోర్టు తీర్పు స్పష్టం చేసిందని అన్నారు. 2014లో అధికారంలోకి వచ్చేందుకు 2జీ కుంభకోణం పేరిట ఎన్డీయే తప్పుడు ప్రచారంతో యూపీఏ సంకీర్ణ ప్రభుత్వంపై బుదర చల్లిందని, ఈ విషయం కోర్టు తీర్పుతో స్పష్టమైందన్నారు. ప్రజలను నమ్మించి మోసం చేయడానికి బీజేపీ ఎంతకైనా దిగజారుతుందన్న విషయం ఈ అంశంతో తేలిపోయిందని రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

చిత్రం..సీడబ్ల్యూసీ సమావేశానికి తొలిసారి అధ్యక్షత వహించి మాట్లాడుతున్న రాహుల్ గాంధీ
*
కేసలొకటొకటి వీగగ
ఊసులు ఆదర్శ్ టుజీల ఉసురేతీయన్
మోసులు రేకెత్తించెడి
బాసతొ రాహుల్ విరుచుకుపడెనదిగదిగో!