జాతీయ వార్తలు

ఉగ్రవాదానికి వత్తాసు ఆపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్ (రాజస్థాన్), డిసెంబర్ 22: జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులకు పాకిస్తాన్ వత్తాసు పలకడం మానివేస్తేనే ఆ దేశంతో శాంతిచర్చలకు అవకాశం ఉంటుందని భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ తేల్చిచెప్పారు. అయితే, పాకిస్తాన్ వైఖరి చూస్తుంటే ఆ దేశం నిజంగా శాంతి చర్చలను కోరుకుంటున్నట్లు లేదన్నారు. భారత్- పాక్ సరిహద్దుకు సమీపంలోని థార్ ఎడారిలో సదరన్ కమాండ్ నిర్వహిస్తున్న ‘హమేషా విజరుూ’ సైనిక విన్యాసాలకు హాజరైన సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడాన్ని పాక్ తక్షణం నిలిపివేయాలన్నారు. ‘పాక్‌తో సంబంధాలను మెరుగుపరచుకోవాలని మేం ఆకాంక్షిస్తున్నాం.. అయితే, జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదానికి ఆజ్యం పోస్తున్న అవతలి పక్షం (పాక్) చర్యలను చూస్తుంటే వారు శాంతిచర్చలకు సుముఖంగా లేరనిపిస్తోంది’ అని వ్యాఖ్యానించారు. జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులను అణచివేసేందుకు ఆర్మీ, పారామిలటరీ దళాలు, కాశ్మీర్ పోలీసులు చేస్తున్న పోరాటం ఆగదన్నారు. ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఈ కార్యక్రమం ఇకముందు కూడా కొనసాగుతుందన్నారు. ఉగ్రవాద ముఠాలపై పాక్ చర్యలు తీసుకున్నపుడే ఆ దేశంతో సంబంధాలు పెంచుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందంటూ మన విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ ప్రకటించిన మర్నాడే రావత్ స్పందించడం గమనార్హం. ఉగ్రవాదం అనే ప్రధాన సమస్యను భారత్ ఎదుర్కొంటోందన్న విషయాన్ని పాక్ గుర్తించాలని, ఆ దేశ భూభాగం నుంచి ఉగ్రవాదులను ప్రేరేపించడం ఆపివేయాలని అన్నారు. స్నేహభావాన్ని పెంపొందించుకోవాలంటే పాక్ తన వైఖరిని మార్చుకోవాలన్నారు. కాగా, శాంతిచర్చలు జరిపేందుకు పాక్ పౌర ప్రభుత్వం ఆలోచిస్తే ఆ దిశగా తాను కృషి చేస్తానని ఆ దేశ ఆర్మీ అధిపతి జనరల్ బజ్వా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్నడూ లేని రీతిలో పాక్ ఆర్మీ అధిపతి ఆ దేశ పార్లమెంటులోని సెనేట్‌కు వెళ్లి భద్రతా పరిస్థితులను, ప్రాంతీయ సమస్యలను వివరించారు.