జాతీయ వార్తలు

పోషకాహార పథకంలో ‘ఆధార్’ తప్పనిసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: కేంద్ర ప్రభుత్వ సౌజన్యంతో నడుస్తున్న ‘జాతీయ పోషకాహార పథకం’ ద్వారా లబ్ధి పొందుతున్న పిల్లలకు ‘ఆధార్’ నమోదు తప్పనిసరి అని కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ సహాయ మంత్రి వీరేంద్ర కుమార్ లోక్‌సభలో తెలిపారు. ప్రభుత్వం అందజేసే రాయితీలు, సేవలు, ఇతర ప్రయోజనాలకు ‘ఆధార్’ కార్డు కచ్చితమైన గుర్తింపులా పనిచేస్తుందన్నారు. సంక్షేమ పథకాలు పారదర్శకంగా, ఫలవంతంగా అమలు జరగాలంటే ఆధార్ కార్డులను వినియోగాంచాల్సి ఉందన్నారు. ఇతర ధ్రువీకరణ పత్రాలు అవసరం లేకుండా ఒక్క ఆధార్ కార్డు ఉంటే అది లబ్ధిదారులకు సంబంధించి కచ్చితమైన గుర్తింపు పత్రంలా ఉంటుందని ఆయన లోక్‌సభ ప్రశ్నోత్తరాలు సమయంలో వెల్లడించారు. ఆధార్ కార్డులు లేనివారు ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో ఉన్న సిబ్బంది ద్వారా వాటిని పొందాలన్నారు. ఆధార్ కార్డులు వచ్చేంతవరకూ పిల్లలకు అంగన్‌వాడీల్లో వేరే ధ్రువపత్రాలను ఆధారం చేసుకుని పోషకాహారం అందజేస్తారన్నారు. పిల్లలకు ఎంతమేరకు పోషకాహారం అందుతున్నదన్న విషయాన్ని ఆధార్ అనుసంధానం ద్వారా సులభంగా తెలుసుకోవచ్చని మంత్రి వివరించారు. 2017-18 నుంచి 2019-20 వరకూ పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు 9,046 కోట్ల రూపాయలను కేటాయించామన్నారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లక్ష్యాలను నిర్ణయించి, జాతీయ పోషకాహార పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామన్నారు.