జాతీయ వార్తలు

చొరబాటుదారుడి కాల్చివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమృత్‌సర్, డిసెంబర్ 23: భారత-పాక్ సరిహద్దు నుంచి అక్రమ చొరబాటుకు యత్నించిన ఓ వ్యక్తిని బీఎస్‌ఎఫ్ సైనికులు హతమార్చారు. భారత భూ భాగంలోని అజ్నాలా వద్ద శనివారం ఉదయం పాక్‌కు చెందిన చొరబాటు దారుడు ప్రవేశిస్తుండగా బిఎస్‌ఎఫ్ 70వ బెటాలియన్ సైనికులు కాల్పులు జరిపారు. 65 ఏళ్ల వయసున్న ఆ వ్యక్తి సైనికులు చేసిన హెచ్చరికలను ఖాతరు చేయలేదు. సైనికులు వారిస్తున్నప్పటికీ ఆ వ్యక్తి చొరబాటుకు యత్నించాడు. దీంతో సైనికులు కాల్పులు జరపగా చొరబాటుదారుడు మరణించాడు. పోస్టుమార్టం అనంతరం అతని మృతదేహాన్ని మార్చురీలో ఉంచారు. ఆ వ్యక్తికి సంబంధించి పూర్తి వివరాలను ఆరా తీస్తున్నామని బిఎస్‌ఎఫ్ అధికారులు తెలిపారు. అజ్నాలా వద్ద గత సెప్టెంబర్‌లో పాకిస్తాన్‌కు చెందిన ఇద్దరు చొరబాటుదారులను బిఎస్‌ఎఫ్ సైనికులు మట్టుబెట్టారు.