జాతీయ వార్తలు

హైకోర్టులో సవాలు చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచి, డిసెంబర్ 23: దాణా కుంభకోణం కేసులో సిబిఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాలు చేస్తామని ఆర్‌జెడి సీనియర్ నాయకుడు రఘువంశ్ ప్రసాద్ స్పష్టం చేశారు. ఈ కేసులో ఆర్‌జెడి అధినేత లాలూప్రసాద్‌ను సిబిఐ ప్రత్యేక కోర్టు దోషిగా ప్రకటించిన విషయం విదితమే. తీర్పు వెలువడిన అనంతరం కోర్టు బయట రఘువంశ ప్రసాద్ విలేఖరులతో మాట్లాడుతూ ఈ తీర్పుపై న్యాయపోరాటం చేస్తామని వెల్లడించారు.
ఈ తీర్పును హైకోర్టులో సవాలు చేస్తామని, ఇంతకుమించి ప్రత్యామ్నాయం లేదని పేర్కొన్నారు. న్యాయపోరాటంతో పాటు రాజకీయంగా కూడా పోరాడతామని, ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తామన్నారు. కోర్టు తీర్పుపై మరో సీనియర్ నేత, లాలూకు అత్యంత సన్నిహితుడైన అబ్దుల్ బారీ సిద్దిఖీ స్పందిస్తూ తీర్పుపై ఇప్పుడే వ్యాఖ్యానించడం సరైంది కాదని అన్నారు. ఒకే కేసులో కొంతమందికి స్వేచ్ఛను ప్రసాదిస్తూ, మరికొంతమందికి జైలుశిక్ష విధించడంపై ప్రజలు చర్చించుకుంటున్నారని తెలిపారు. కోర్టు తీర్పును బీజేపీ, జెడి(యు) ముందుగానే ఎలా ఊహించాయో అర్థం కావడం లేదని, ఇందుకు సంబంధించి ప్రజల్లో అయోమయం నెలకొందని అన్నారు. ‘మా పార్టీ అధినేత జైలుకు వెళ్లడం కొత్త కాదు. ఇంతకుముందు కూడా వెళ్ళారు. జైలునుంచి బయటికొచ్చిన ప్రతిసారీ పార్టీ రెట్టింపు స్థాయిలో బలోపేతం అవుతుంది. ఈ కారణంగానే బిహార్‌లో ఆర్‌జెడి నెంబర్ వన్ స్థానంలోనే ఉంటోంది’ అని ఆయన పేర్కొన్నారు. జనవరి 3వ తేదీన కోర్టు ప్రకటించబోయే శిక్షను బట్టి తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తామని సిద్దిఖీ తెలిపారు.