జాతీయ వార్తలు

‘దాణా’ మేత ఇలా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిహార్‌లో 950 కోట్ల రూపాయల దాణా కుంభకోణం 1996లో వెలుగు చూసింది. 2000లో బిహార్ నుంచి కొత్తగా ఏర్పడిన ఝార్ఖండ్ రాష్ట్రానికి 39 దాణా కేసులను బదిలీ చేశారు (మొత్తం దాఖలైన కేసులు 61). ఈ కుంభకోణానికి సంబంధించి 20 ట్రక్కుల్లో డాక్యుమెంట్లు సిబిఐ కోర్టుకు తరలించారు. ఈ కుంభకోణంలో బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ సహా 17 మందిని సిబిఐ ప్రత్యేక కోర్టు శనివారం నాడు దోషులుగా ప్రకటించడం వరకూ అనేక పరిణామాలు జరిగాయి. వాటిలో ముఖ్యమైనవి కొన్ని..
జనవరి, 1996: దాణా కుంభకోణం వెలుగు చూశాక డిప్యూటీ కమిషనర్ అమిత్ ఖారే పశుసంవర్ధక శాఖలో దాడులు నిర్వహించారు.
మార్చి, 1996: విచారణ జరపాలని పాట్నా హైకోర్టు సిబీఐని ఆదేశించింది. చైబసా ట్రజరీ కేసులో సిబిఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.
జూన్, 1997: లాలూ ప్రసాద్‌ను నిందితుల్లో ఒకరిగా పేర్కొంటూ సిబిఐ చార్జిషీట్.
జూలై, 1997: సీఎం పదవికి లాలూ రాజీనామా. ముఖ్యమంత్రిగా లాలూ భార్య రబ్రీదేవి ఎంపిక. సిబిఐ కోర్టులో లొంగిపోయాక జుడీషియల్ కస్టడీకి లాలూ తరలింపు.
ఏప్రిల్ 2000: దాణా కుంభకోణంలో రబ్రీదేవిపైనా అభియోగాలు. ఆమెకు బెయిల్ మంజూరు.
అక్టోబర్ 2001: బిహార్ విభజన తర్వాత దాణా కేసును ఝార్ఖండ్‌కు మారుస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు.
ఫిబ్రవరి 2002: ఝార్ఖండ్‌లోని సిబిఐ ప్రత్యేక కోర్టులో విచారణ ప్రారంభం.
డిసెంబర్ 2006: అక్రమ ఆస్తుల కేసులో లాలూ, రబ్రీలకు విముక్తి కలిగిస్తూ పాట్నా కోర్టు తీర్పు.
మార్చి 2012: బిహార్ మాజీ సిఎంలు లాలూ, జగన్నాథ్ మిశ్రాలపై చార్జిషీట్లు
సెప్టెంబర్ 2013: లాలూ, మిశ్రాలతో పాటు 45 మందికి మరో దాణా కేసులో శిక్షలు ఖరారు. రాంచీ జైలుకు లాలూ తరలింపు. లోక్‌సభ సభ్యుడిగా లాలూపై అనర్హత వేటు. ఎన్నికల్లో పోటీకి అనర్హత.
డిసెంబర్ 2013: లాలూకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు.
మే 2017: సుప్రీం ఆదేశాల అనంతరం మళ్లీ విచారణ ప్రారంభం. దేవ్‌గఢ్ ట్రజరీ కేసును విడిగా విచారించాలని సుప్రీం ఉత్తర్వులు.
డిసెంబర్ 23, 2017: లాలూ సహా 17 మందిని దోషులుగా గుర్తించిన సిబిఐ ప్రత్యేక కోర్టు. ఆరు కేసుల్లో ఇప్పటికి రెండు కేసులకు సంబంధించి దోషిగా తేలిన లాలూ.