జాతీయ వార్తలు

పట్టాలు తప్పిన రాయలసీమ ఎక్స్‌ప్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, డిసెంబర్ 23: తిరుపతి - నిజామాబాద్ మధ్య రాకపోకలు సాగించే రాయలసీమ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం సిర్నాపల్లి శివారులో శనివారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది. లోకో పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రయాణికులు ఈ ప్రమాదం బారి నుండి సురక్షితంగా బయటపడగలిగారు. నవంబర్ 2వ తేదీ నుండి కొత్తగా నిజామాబాద్ నుండి తిరుపతి మధ్య రాయలసీమ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసును ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగానే శుక్రవారం తిరుపతి నుండి బయలుదేరిన రైలు, శనివారం ఉదయం 6.30 గంటల సమయానికి సిర్నాపల్లి ప్రాంతానికి చేరుకుంది. మరికొద్దిసేపట్లో గమ్యస్థానమైన నిజామాబాద్‌కు చేరుకోవాల్సి ఉండగా, సిర్నాపల్లి అటవీ ప్రాంతం వద్ద పట్టాలు తప్పింది. ప్రమాదాన్ని పసిగట్టిన పైలట్ వెంటనే అప్రమత్తమై సడన్ బ్రేక్‌లు వేస్తూ రైలును నిలిపివేయడంతో బోగీలు బోల్తాపడకుండా నిలువరించగలిగారు. కేవలం రైలింజన్‌తో పాటు దాని వెనుక ఉన్న మరో రెండు బోగీలు మాత్రమే పట్టాలు తప్పినప్పటికీ, యథావిధిగా భూమి మీద నిల్చుండిపోయాయి. దీంతో పెను ప్రమా దం బారి నుండి ప్రయాణికులు సురక్షితంగా తప్పించుకున్నట్లయింది. అయితే రైలు బోగీలన్నీ ఒక్కసారిగా భారీ కుదుపునకు గురికావడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
దక్షిణ మధ్య రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ రైలు ప్రమాదంతో నిజామాబాద్ - సికిందరాబాద్ మార్గంలో నడిచే నాందేడ్-కాచిగూడ, అక్కన్నపేట-బోధన్ తదితర రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైల్వే సాంకేతిక విభాగం సిబ్బంది భారీ సంఖ్యలో చేరుకుని మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి రైలు బోగీలను మళ్లీ పట్టాలపైకి చేర్చడంతో రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. అయితే సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలు ఏమిటనే దానిపై రైల్వే ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఈ ఘటనలో విద్రోహ చర్యలకు ఆస్కారం లేనప్పటికీ, సాంకేతికపరమైన కారణాల వల్లే రైలు బోగీలు పట్టాలు తప్పి ఉంటాయని నిర్ధారణకు వచ్చారు. దాదాపు ఆరు గంటలు ఆలస్యమైనప్పటికీ, పెను ప్రమాదం బారి నుండి బయటపడి సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవడంతో అటు ప్రయాణికులు, ఇటు రైల్వే వర్గాల వారు ఊపిరి పీల్చుకున్నారు.

చిత్రం..నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం సిర్నాపల్లి శివారులో పట్టాలు తప్పిన
రాయలసీమ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు