జాతీయ వార్తలు

మీసా భారతిపై ఈడీ చార్జిషీట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 23: ఆర్‌జేడీ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా భారతిపైన, ఆమె భర్తపైన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ అభియోగంపై చార్జిషీట్ దాఖలు చేసింది. ప్రత్యేక న్యాయస్థానంలో జడ్జి ఎన్‌కే మల్హోత్రా ఎదుట ఈడీ తరఫున హాజరైన న్యాయవాది నితీశ్ రాణా ఈ చార్జిషీట్‌ను శనివారం దాఖలు చేశారు. అంతకుముందు దక్షిణ ఢిల్లీలో బిజ్వసాన్ ప్రాంతంలో మీసా భారతి, ఆమె భర్త శైలేష్‌కుమార్‌కు చెందిన ఫామ్‌హౌస్‌ను ఈడీ అధికారులు జప్తు చేశారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఏ) కింద మీసా భారతి, శైలేష్‌లకు చెందిన ఫామ్‌హౌస్‌ను జప్తు చేశామని, అది ప్రస్తుతం ‘మెస్సర్స్ మిషైల్ పేకర్స్ అండ్ ప్రింటర్స్ ప్రైవేట్ లిమిటెడ్’ అధీనంలో ఉందని ఈడీ అధికారులు తెలిపారు. ఆ ఫామ్‌హౌస్‌ను 1.2 కోట్ల రూపాయల వ్యయంతో 2008-09లో కొనుగోలు చేశారని, ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ ఆరోపణలున్నాయని వారు చెప్పారు. ఈ కేసు విషయంలో వాస్తవాలను రాబట్టేందుకు సురేంద్ర కుమార్ జైన్, వీరేంద్ర జైన్ అనే సోదరులతో మరికొంతమందిని విచారించామన్నారు. డొల్ల కంపెనీలను ఏర్పాటు చేసి వీరంతా మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారని వివరించారు. జైన్ సోదరులతో పాటు ఓ చార్టెర్డ్ అకౌంటెంట్‌ను కూడా అరెస్టు చేసి పిఎంఎల్‌ఏ కింద కేసులు నమోదు చేశామన్నారు. మిషైల్ పేకర్స్ అండ్ ప్రింటర్స్ సంస్థలో జైన్ సోదరులు 90 లక్షల రూపాయలను పెట్టుబడిగా పెట్టేందుకు రాజేశ్ అగర్వాల్ అనే వ్యక్తి మధ్యవర్తిగా వ్యవహరించాడు. మిషైల్ సంస్థకు మీసా భారతి, ఆమె భర్త శైలేష్ గతంలో డైరెక్టర్లుగా పనిచేశారు. ఢిల్లీలోని తుగ్లక్ రోడ్ చిరునామాలో ఉన్న మిషైల్ సంస్థలో మీసా భారతికి ఇప్పటికీ షేర్లు ఉన్నాయి. మనీ లాండరింగ్ కేసులో ఇప్పటికే మీసా భారతి, ఆమె భర్తను విచారించామని ఈడీ అధికారులు తెలిపారు. 1.2 కోట్ల మనీ లాండరింగ్‌లో ఈ దంపతులతోపాటు చార్టెర్డ్ అకౌంటెంట్ అగర్వాల్, బిహార్ మాజీ ముఖ్యమంత్రి కీలక పాత్రధారులుగా ఉన్నారని పేర్కొన్నారు.