జాతీయ వార్తలు

పండుగల వేళ అదనపు బాదుడుకు రైల్వే కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 24: పీక్ సీజన్,పండుగ సమయాలలో అదనపు చార్జీలను వసూలు చేయడంతో సహా,రద్దీ తక్కువ ఉండే రైల్లు,మార్గాలలలో ప్రయాణికులకు రాయితీలు ఇచ్చేందకు రైల్వేమంత్రిత్వాశాఖ కసరత్తు మొదలుపెట్టింది.విమానయానశాఖ తరహాలో ఈ మేరకు డైనమిక్ ప్రైసింగ్ విధానం రైలేశాఖలో ప్రవేశపెట్టల్సిన అవసరం ఉందని సీనియర్ రైల్వే అధికారులు,బోర్డు సభ్యులతో ఇటివల రైల్వేమంత్రి పియూష్ గోయల్ సమావేశం అయిన సందర్భంగా ఈ ప్రతిపాదనపై ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది.ఈ డైనమిక్ ప్రైసింగ్ విధానం పై కేంద్రమంత్రి పియూష్ గోయల్‌కు ఇప్పటికే తూర్పు,పశ్చిమ,పశ్చిమ మధ్య రైల్వే జోన్ అధికారులు ఇప్పటికే ప్రతిపాదనలు సమర్పిచారు.పిక్ సీజన్,పండుగ సమయాలలో ప్రయాణికుల నుంచి 10 నుంచి 20 శాతం అదనంగా చార్జీలను వసూలు చేయాలని సూచించారు. హైస్పిడ్ రైల్లు,ఎక్స్‌ప్రెస్ రైళ్లలలో మనకు నచ్చిన బేర్త్‌ల ఎంపీకపైన అదనపు చార్జీలను ప్రతిపాదించారు.రద్దీ తక్కువగా ఉండే రైళ్లతో సహా వేళకాని వేళ్లాలో గమ్య స్థానాలకు చేరే ప్రయాణికులకు 10 నుంచి 30 శాతంలో రాయితీలను ఇవ్వలని సిఫార్సు చేశారు. వారాంతాంలతో పాటు దీపావళి,దసరా,క్రిస్‌మస్ వంటి పండుగల సమయంలో అదనపు చార్జీలు వసూలు చేయాలని సూచించారు. ఈ కొత్త చార్జీల విధానానికి అమలు చేసేందుకు ఈ నెల 31 నాటికి తుది ముసాయిదా తయారు చేసే అవకాశం ఉంది.