జాతీయ వార్తలు

యోగా మతం కాదు..ఆరోగ్య సాధనం: వెంకయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 24: అన్నివిధాలా సమస్యలమయం, ఒత్తిడిమయంగా మారిన ఆధునిక పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే యోగా ఒక్కటే సరైన మార్గమని ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు ఆదివారం నాడిక్కడ స్పష్టం చేశారు. యోగా చేయడం అన్నది కేవలం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉద్దేశించిందే తప్ప, ఇందులో మతపరమైన ఉద్దేశంకాని, భావనకానీ ఏమీ లేదని ఉద్ఘాటించారు. నేటి జీవనశైలి యాంత్రికమయంగా మారిందని, దీని కారణంగా వ్యాయామానికి ఏరకంగానూ ఆస్కారం లేని పరిస్థితులు ప్రతి ఒక్కరికీ నిరంతరం ఎదురవుతూనే వస్తున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో శారీరకంగాను, మానసికంగాను ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి యోగాను మించిన సాధన మరొకటి లేదని శాంతాక్రజ్‌లోని ఓ యోగా సంస్థ శతవార్షికోత్సవాలను ప్రారంభించిన సందర్భంగా వెంకయ్య స్పష్టం చేశారు. వర్తమాన ప్రపంచానికి భారత్ అందించిన ఆరోగ్య సాధన బహుమతిగా యోగాను ఆయన అభివర్ణించారు. యోగా అన్నది హిందూమతంతో ముడిపడి ఉందని భావించేవారిని ఉద్దేశించి మాట్లాడిన ఆయన ‘హిందూమతం అన్నది ఓ జీవన విధానం’ అన్న వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలన్నారు. అయితే యోగాను ఆరోగ్య సముపార్జన ప్రక్రియగా కాకుండా, ఓ మతానికి సంబంధించినదిగా కొందరు ప్రచారం చేయడం దురదృష్టకరమన్నారు. దీనికి ఏ మాతంతోనూ సంబంధం లేదని పేర్కొన్న ఆయన శాంతియుత జీవనానికి యోగాను ఓ శాస్తబ్రద్ధమైన ప్రక్రియగా అభివర్ణించారు. ప్రపంచవ్యాప్తంగా యోగాను ప్రచారం చేస్తున్నందుకు ఈ సంస్థ చేస్తున్న కృషిని అభినందించిన వెంకయ్య ‘మూడు తరాలుగా మీరు చేస్తున్న కృషి అభినందనీయం. ఎందరో యోగా టీచర్లను మీరు ప్రపంచానికి అందిచారు’ అని స్పష్టం చేశారు. నేటి సమాజంలో కొన్ని దుష్టశక్తులు ప్రవేశించాయని పేర్కొన్న ఆయన, నైతికవర్తనకు సంబంధించిన పాఠ్యాంశాన్ని అన్ని పాఠశాలల్లో బోధనాంశంగా చేర్చాల్సిన అవసరం ఉందన్నారు. దీనివల్లే ఈ చెడు శక్తులను చిన్నతనం నుంచే త్యజించే మనస్థత్వాన్ని పిల్లలు అలవర్చుకోగలుగుతారన్నారు. ‘మూడు నాలుగేళ్లు కూడా నిండని బాలికలు మానభంగానికి గురవుతున్నారు. మర్యాద, సంప్రదాయం, గౌరవం అన్న వాటికి విలువే లేకుండా పోయింది. ఒకప్పుడు నైతిక వర్తనకు సంబంధించిన పాఠ్యాంశాలు స్కూళ్లలో ఉండేవి. మళ్లీ వాటిని చేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అని ఉద్ఘాటించారు. గూగుల్‌ను ఉపయోగించటం అన్నది సరైనదే అయినప్పటికీ, అది ఎంతమాత్రం అధ్యాపకుడికి ప్రత్యామ్నాయం కాదని పేర్కొన్న వెంకయ్యనాయుడు ‘గురువు చెప్పే పాఠాలు వింటే నీ వ్యక్తికత్వం, సామర్థ్యం, సత్తా, ప్రవర్తనాశైలి ఇనుమడిస్తాయి’ అని అన్నారు.
చిత్రం..సమావేశంలో మాట్లాడుతున్న ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు