జాతీయ వార్తలు

బిల్లును ఆపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, డిసెంబర్ 24: ట్రిపుల్ తలాక్‌ను రద్దుచేయడానికి ఉద్దేశించిన బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించాలని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపిఎల్‌వి) ఆదివారం ఇక్కడ డిమాండ్ చేసింది.
ఈ బిల్లు రాజ్యాంగ నిబంధనలకు మహిళల హక్కులకు విరుద్ధమని స్పష్టం చేసింది. ట్రిపుల్ తలాక్ రద్దు యోచన కేంద్ర ప్రభుత్వ కుట్ర అనీ, మహిళల హక్కులను కాలరాసేందుకే ప్రభుత్వం ఈ ఆలోచన చేసిందని బోర్డు చైర్మన్ వౌలానా రాబే హసానీ నద్వీ విమర్శించారు. ట్రిపుల్ తలాక్‌ను శిక్షార్హ నేరంగా పరిగణిస్తూ కేంద్రం చేపట్టిన ఈ బిల్లును నిలిపివేయాలని లేదా వెనక్కి తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీని నద్వీ కోరనున్నట్లు బోర్డు అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమని, మహిళల హక్కులను కాలరాసేదని, అలాగే షరియా చట్టానికి ఇది విరుద్ధమని ముస్లిం లా బోర్డు భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే ఈ బిల్లు ద్వారా ముస్లింల వివాహ చట్టం విషయంలోనూ జోక్యం చేసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నించినట్టవుతుందని కూడా ఆయన అన్నారు. ఈ బిల్లు చట్టంగా మారితే ముస్లిం మహిళలు అనేక రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితులు తలెత్తుతాయని వౌలానా ఖలీల్ ఉల్ రహ్మాన్ సజ్జాద్ నోమాని స్పష్టం చేశారు. అసలు మస్లిం పర్సనల్ లా బోర్డును సంప్రదించకుండా ఏ ముస్లిం సంస్థతోనూ చర్చలు జరపకుండా ప్రభుత్వం ఈ బిల్లును తలపెట్టడం అభ్యంతరకరమన్నారు. వచ్చేవారంలో కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉండటంతో దీన్ని వ్యతిరేకిస్తూ ముస్లిం పర్సనల్ లా బోర్డు మాట్లాడటం ఉత్కంఠను రేకెత్తిస్తోంది.