జాతీయ వార్తలు

ఆయనొక 420!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, డిసెంబర్ 25: ‘అతనొక అబద్ధాలకోరు, 420’ అంటూ ఆర్‌కె నగర్ ఉప ఎన్నికలో విజయం సాధించిన టీటీవీ దినకర్‌న్‌పై తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వం విరుచుకుపడ్డారు. ‘దినకరన్ చెప్పినవన్నీ అబద్ధాలే. అబద్ధాలతోనే తానొక 420 అని రుజువు చేసుకున్నాడు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జయలలిత ప్రాతినిథ్యం వహించిన ఆర్‌కె నగర్ ఉప ఎన్నికలో ఆ పార్టీ బహిష్కృత నేత, శశికళ విధేయుడైన దినకరన్ అనూహ్య మెజారిటీతో విజయం సాధించటం తెలిసిందే. ఏఐడీఎంకే అంచనాలను తల్లకిందులు చేస్తూ ఆ పార్టీ అభ్యర్థి మధుసూదన్‌పై 45వేల మెజార్టీని దినకరన్ సాధించారు. ఇది ఏఐడీఎంకే చీఫ్ జయలలిత పోటీ చేసినప్పుడు వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ. ఈ విజయంతో అటు ఏఐడీఎంకేలో భారీ మార్పులు రాబోతున్నాయని, మూడు నెలల్లో తస్మదీయుల ప్రభుత్వం కుప్పకూలుతుందని దినకరన్ ప్రకటించారు. దినకరన్ విజయోత్సాహ ప్రకటన ఏఐడీఎంకే పెద్దల్లో గుబులు రేపుతోంది. దినకరన్ విజయంతో ఖంగుతున్న ఏఐడీఎంకే నాయకత్వం, చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశమైంది. పార్టీ ఘోర వైఫల్యానికి కారణాలపై విస్తృత సమీక్ష నిర్వహించింది. అనంతరం ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం మీడియాతో మాట్లాడుతూ ఆస్పత్రిలో జయలలితను రాష్టమ్రంత్రి ఒకరు కలిశారన్న వాదనలో నిజం లేదని స్పష్టం చేశారు. శశికళ, ఆమె అనుంగు విధేయులకు మాత్రమే ఆస్పత్రిలో అమ్మను కలిసే అవకాశం దక్కిందని వివరించారు. ‘ఆస్పత్రిలో అమ్మను ఏ మంత్రీ కలవలేదు’ అని మీడియాకు స్పష్టం చేశారు. ‘వైద్య సహాయకురాలిగా నర్సు కలిసింది. తరువాత వాళ్లు మాత్రమే కలిశారు’ అని శశికళ వర్గాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. పార్టీలో కీలక వ్యక్తులు ఎందుకు ఆమెను కలవలేకపోయారన్న మీడియా ప్రశ్నకు సమాధానమిస్తూ ‘మేం సదుద్దేశంతోనే వెళ్లలేదు. అమ్మకు ఇనె్ఫక్షన్ సోకే అవకాశం ఉందన్న వైద్యుల సలహామేరకే ఆగిపోయాం. ఆమె కోలుకోవాలని మాత్రమే మేం ప్రార్థించాం. అమ్మను చూసిన తరువాత వాళ్లు బయటకు వచ్చి అంతా బాగుందని, అమ్మ భోజనం కూడా చేస్తున్నారని చెప్పారు. ఆ మాటలు నమ్మి అంతా బాగుందనే అనుకున్నాం’ అని పన్నీర్‌సెల్వం వివరించారు.
ఇదిలావుంటే, ఆర్‌కె నగర్ ఉప ఉన్నికలో ఏఐడిఎంకె వైఫల్యంపై ఆదివారం పెద్దఎత్తున సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి పళనిస్వామి ఆదేశాలతో అత్యవసరంగా సమావేశమైన పార్టీనేతలు ఓటమిపై లోతైన చర్చ జరిపారు. సమావేశం అనంతరం పార్టీలో ముఖ్య బాధ్యతలు నిర్వర్తిస్తున్న తొమ్మిదిమందిపై వేటు వేస్తున్నట్టు ప్రకటించారు. వెట్రివేల్, తంగతమిళసెల్వన్, రంగస్వామి, ముత్తయ్య, విపి కళైరాజన్, షోలింగుర్ పార్టీబన్, పార్టీ అధికార ప్రతినిధులు నాన్చిల్ సంపత్, సిఆర్ సరస్వతిలను పార్టీనుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. అయితే, వీరిపై ఎందుకు వేటు వేశారన్న విషయాన్ని మాత్రం పార్టీ అధికారికంగా ప్రకటించలేదు. దినకరన్‌కు అనుకూలంగా పనిచేసి, ఏఐడీఎంకే అభ్యర్థి ఓటమికి కారణమయ్యారన్న కోణంలోనే వీరిపై వేటు వేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.