జాతీయ వార్తలు

మైనారిటీ విద్యార్థుల సంక్షేమానికి కృషి: నఖ్వీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోజికోడ్, డిసెంబర్ 25: మైనారిటీ వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ వారి సంక్షేమానికి తగిన చర్యలు తీసుకునేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. సోమవారం ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, మైనారిటీ విద్యార్థుల కోసం ‘తహ్రీక్ ఇ తలీమ్’ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. తన మంత్రిత్వశాఖలో 65 శాతం నిధులను విద్య, సాధికారత, నైపుణ్యాల రంగంలో మైనారిటీ విద్యార్థులు రాణించేందుకు వెచ్చిస్తున్నామన్నారు. ఇతర వర్గాల వారితో సమానంగా మైనారిటీలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు మోదీ ప్రభుత్వం దీక్ష వహించిందన్నారు. గత ఆరునెలల్లో వందలాది మైనారిటీ విద్యాసంస్థలను, మదరసాలను ప్రధాన స్రవంతిలోకి తెచ్చామన్నారు. ‘టీచర్, టిఫిన్, టాయిలెట్’ వంటి సౌకర్యాలను ఏర్పాటు చేయడం ద్వారా విద్యాసంస్థలను మెరుగుపరచామన్నారు. మైనారిటీ వర్గాల్లో ఉన్నత విద్య పూర్తిచేసిన యువతులకు ‘షాదీ షాగున్’ పథకం కింద 51వేల చొప్పున ఆర్థిక ప్రోత్సాహకాలను అందిస్తున్నామన్నారు. దేశ ప్రగతిలో మైనారిటీలనూ భాగస్వాములు చేసేందుకు తమ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఆయన వివరించారు. ఈ ఏడాది సివిల్ సర్సీసెస్ పరీక్షల్లో వందమందికి పైగా మైనారిటీ యువకులు ఎంపికైనట్లు, అందులో 52 మంది ముస్లిం వర్గానికి చెందినవారని మంత్రి తెలిపారు.