జాతీయ వార్తలు

కల్యాణ వైభోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూరత్, డిసెంబర్ 25: సూరత్‌లోని ప్రముఖ వజ్రాల వ్యాపారి మహేశ్ సవానీ తన సహృదయతను మరోసారి చాటుకున్నారు. తండ్రి లేని 251 మంది పేద యువతులకు ఆదివారం నాడు ఆయన అంగరంగ వైభవంగా సామూహిక వివాహాలు జరిపించారు. గత ఏడేళ్లుగా ఆయన నిరుపేద యువతులకు సామూహిక వివాహాలు జరిపిస్తున్నారు. ఈ ఏడాది ఆయన ఐదుగురు ముస్లిం, ఒక క్రైస్తవ యువతి సహా మొత్తం 251 మందికి తన ఇంట్లో శుభకార్యం మాదిరి దగ్గరుండి వివాహాలు జరిపించారు. కొత్తబట్టలు, కాంతులీనే నగలు ధరించిన వధూవరులతో సూరత్ నగరం మిలమిలా మెరిసింది. వేలాది మంది అతిథులు ఈ సందర్భంగా హాజరై కొత్తజంటలను దీవించారు. గత ఏడాది సామూహిక వివాహాల అనంతరం కొత్త దంపతులకు మహేశ్ సవానీ బంగారు నగలు, సోఫాలు, మంచాలు, ఇతర గృహోపకరణాలను ఉచితంగా అందజేశారు. వీటి కోసం ఒక్కో జంటకు ఆయన అయిదు లక్షల రూపాయలు వెచ్చించారు. ఈసారి కూడా బహుమతులు బాగానే ఉంటాయని నవ దంపతులు ఆశిస్తున్నారు. సామాజిక బాధ్యతతో తాను పేదింటి యువతులకు వివాహాలు జరిపిస్తున్నానని సవానీ చెబుతున్నారు. కుమార్తెలకు వివాహాలు జరిపించలేని తల్లిదండ్రులు పడే కష్టాల గురించి తెలిస్తే ఎవరికైనా హృదయం ద్రవిస్తుందని ఆయన అంటారు. ఈ ఏడాది సామూహిక వివాహాలకు స్థానిక రియల్ ఎస్టేట్ వ్యాపారి సంజయ్ మొవాలియా తనకు అండగా నిలిచారని సవానీ తెలిపారు. సామూహిక వివాహాల సందర్భంగా జరిగిన విందుకు వధూవరులు, వారి తల్లిదండ్రులు, బంధుమిత్రులు భారీసంఖ్యలో తరలివచ్చారు.