జాతీయ వార్తలు

ప్రభుత్వాలు విఫలమైతేనే కోర్టుల జోక్యం: సుప్రీం కోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 6: కార్యనిర్వాహక వర్గం తన రాజ్యాంగ బాధ్యతల నిర్వహణలో విఫలమైతేనే న్యాయస్థానాలు జోక్యం చేసుకోవల్సిన పరిస్థితి ఏర్పడుతుందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ స్పష్టం చేశారు. విమర్శలను గుప్పించే బదులు ప్రభుత్వం తన విధులను నిర్వర్తించాలని, కార్యనిర్వాహక వర్గం తన ధర్మాన్ని నిర్వర్తించడంలో విఫలమయినప్పుడే ప్రజలు న్యాయస్థానాలు ఆశ్రయిస్తారని ఆయన అన్నారు. ఓ న్యూస్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఠాకూర్ స్పష్టం చేశారు. కోర్టులు తమ రాజ్యాంగ బాధ్యతలనే నిర్వర్తిస్తాయిన ప్రభుత్వం తమ విధులను నిర్వహించుకుంటూ పోతే కోర్టుల జోక్యానికి ఆస్కారమే ఉండదిన వ్యాఖ్యానించారు. న్యాయస్థానాలు, కేంద్రానికి మధ్య సంఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన ఈ వ్యాఖ్యలను ప్రాధాన్యత ఏర్పడింది. ప్రభుత్వాలు విఫలమైతే కచ్చితంగా న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవల్సి ఉంటుందని విస్పష్టంగా తెలియజేశారు. కార్యనిర్వహక వర్గ విధుల్లో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకుంటోందంటూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇటీవల చేసిన విమర్శలపై స్పందించిన చీఫ్ జస్టిస్‌‘మేం రాజ్యాంగ విధులను మాత్రమే నిర్వర్తిస్తాం. ప్రభుత్వాలు సక్రమంగా పనిచేస్తే దీనికి ఎలాంటి అవకాశం ఉండదు’అని అన్నారు. న్యాయస్థానంలో పెరిగిపోతున్న ఖాళీలను భర్తీచేయాలంటూ ప్రధానిని అనేక సందర్భాల్లో అభ్యర్థించానని, అదే విధంగా కేంద్రానికి నివేదికా పంపామని ఠాకూర్ చెప్పారు.