జాతీయ వార్తలు

కులభూషణ్ జాదవ్ భార్య బూట్లలో ‘లోహ పదార్థం’ ఉంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, డిసెంబర్ 27: కులభూషణ్ జాదవ్‌ను అతని భార్య, తల్లి కలిసేందుకు మానవతా దృక్పథంతో అనుమతి ఇచ్చామని చెబుతున్న పాకిస్తాన్ మరోసారి తన కుటిల మనస్తత్వాన్ని బయటపెట్టుకుంది. ఇస్లామాబాద్ జైలుకు వచ్చినపుడు జాదవ్ భార్య వేసుకున్న బూట్లను స్వాధీనం చేసుకుని వాటిని తిరిగి ఇచ్చేందుకు అక్కడి భద్రతా అధికారులు నిరాకరించిన సంగతి తెలిసిందే. ఆమె వేసుకున్న బూట్లలో ‘లోహ పదార్థాన్ని’ భద్రతా సిబ్బంది గుర్తించినట్లు పాక్ మీడియా తెలిపింది. ఈ కారణంగానే వాటిని ఆమెకు తిరిగి ఇవ్వలేదని ‘డాన్’ పత్రిక పేర్కొంది. ఈ విషయాన్ని పాక్ విదేశాంగ కార్యాలయం అధికార ప్రతినిధి మహ్మద్ ఫైజల్ చెప్పారని పాక్ మీడియా ఉటంకించింది. ‘జాదవ్ భార్య వేసుకున్న పాదరక్షల్లో ఏదో పదార్థం ఉంది.. దాని గురించి ఇంకా విచారించాలి.. బూట్లను స్వాధీనం చేసుకున్నాక ఆమెకు మరో జత పాదరక్షలు ఇచ్చాం..’ అని ఫైజల్ చెబుతున్నారు. ‘జాదవ్‌ను కలిసేముందు అతని భార్య, తల్లి చేత బొట్టు చెరిపించారు, తాళి తీయించారు, చేతి గాజులు తొలగించారు, పాదరక్షలు తిరిగి ఇవ్వలేదు..’ అని భారత్ నిరసన వ్యక్తం చేసినపుడు అవన్నీ అవాస్తవాలని పాక్ అధికారులు కొట్టిపారేశారు. అయితే, 24 గంటలు గడవక ముందే పాక్ మాట మార్చింది. జాదవ్ భార్య వేసుకున్న బూట్లలో ఏదో లోహ పదార్థం ఉన్నట్లు గమనించినందునే వాటిని తీసుకున్నామని పాక్ తాజాగా వివరణ ఇచ్చింది. భద్రతా చర్యల పేరిట బొట్టు, మంగళసూత్రం, గాజులను తొలగించడం హేయమైన చర్య అని భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. భద్రతా చర్యల్లో భాగంగానే ఇలా జరిగిందని పాక్ సమర్థించుకుంది. మాటల యుద్ధం కొనసాగించడం తమకు ఇష్టం లేదని పాక్ విదేశాంగ కార్యాలయం పేర్కొంది. జాదవ్ కుటుంబ సభ్యుల పట్ల తాము అమర్యాదగా ప్రవర్తించి ఉంటే- ఆ విషయాన్ని అక్కడే ఉన్న భారత డిప్యూటీ హైకమిషనర్ ఎందుకు ప్రశ్నించలేదని పాక్ అధికారులు అంటున్నారు.
జాదవ్ ఘటనపై నేడు సుష్మ ప్రకటన
న్యూఢిల్లీ: జాదవ్ కుటుంబ సభ్యుల పట్ల పాకిస్తాన్ అధికారులు అమర్యాదకరంగా వ్యవహరించిన తీరుపై లోక్‌సభలో గురువారం ఒక ప్రకటన చేస్తానని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. లోక్‌సభ జీరోఅవర్‌లో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన సభ్యులు జాదవ్ ఉదంతాన్ని ప్రస్తావించారు. పాకిస్తాన్ జైలులో ఉన్న జాదవ్‌ను అతని తల్లి, భార్య కలుసుకునేందుకు అనుమతి ఇచ్చిన ఆ దేశం అత్యంత అమానవీయంగా ప్రవర్తించిందని కాంగ్రెస్, శివసేన, తృణమూల్ కాంగ్రెస్, అన్నాడీఎంకే ఎంపీలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. విపక్ష సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సమయంలో సభలోనే ఉన్న మంత్రి సుష్మా స్వరాజ్ జోక్యం చేసుకుంటూ, ఈ విషయమై గురువారం ఒక ప్రకటన చేస్తానని హామీ ఇచ్చారు. జాదవ్ విషయంలో పాకిస్తాన్ కపట నాటకాన్ని ప్రదర్శిస్తోందని, ఈ విషయాన్ని అన్ని వర్గాల వారూ ఖండించాలని తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు సౌగత్ రాయ్ అన్నారు. మంత్రి సుష్మా స్వరాజ్ స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జాదవ్ భార్య చేత తాళిని తొలగింపజేయడం భారత జాతినే అవమానించేలా ఉందని అన్నాడిఎంకే సభ్యుడు ఎం.తంబిదురై ఆగ్రహం వ్యక్తం చేశారు.