జాతీయ వార్తలు

స్టాలిన్ ఉన్నంతవరకు డీఎంకే గెలుపు అసాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, డిసెంబర్ 27: చెన్నైలోని ఆర్కేనగర్ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో డీఎంకే ఓటమికి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ కారకుడని ఆ పార్టీ బహిష్కృత నేత, స్టాలిన్ సోదరుడు ఎంకే అళగిరి ధ్వజమెత్తారు. ఒక్క ఆర్కేనగర్‌లోనే కాదు... ఎక్కడ ఎన్నికలు జరిగినా స్టాలిన్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నంతవరకు డీఎంకే విజయం సాధించలేదని ఒక మ్యాగ్‌జైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు. 2006-11 మధ్యకాలంలో తమిళనాట తన తండ్రి, డీఎంకే అధినేత కరుణానిధి అధికారంలో ఉన్నపుడు వచ్చిన మంచి అవకాశాన్ని అళగిరి చేజేతులా దుర్వినియోగం చేసుకున్నారు. తన తండ్రి కరుణానిధి ఇపుడు పార్టీ అధినేతగా ఉంటే ఆర్కేనగర్‌లో డీఎంకేకు మూడోసారి ఓటమి తప్పేదన్నారు. డీఎంకేలో అళగిరి, అతన సోదరుడు స్టాలిన్ తమ తండ్రి రాజకీయ వారసత్వాన్ని చాలాకాలం కొనసాగించారు. ఒకవేళ డీఎంకే పార్టీ ఒక మఠమైతే పార్టీ అధ్యక్షుడిగా ముందుగానే ఒక వ్యక్తిని ఎలా ప్రకటిస్తారని ఈ మాజీ కేబినెట్ మంత్రి అళగిరి ప్రశ్నించారు. ఇలావుండగా ఆర్కేనగర్ ఉపఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి ఓటమిపై డీఎంకే త్రిసభ్య కమిటీని వేసింది. ఈ కమిటీ ఈనెలాఖరుకల్లా తన నివేదిక సమర్పిస్తుంది.