జాతీయ వార్తలు

రాజ్యసభలో గొడవకు తెర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ శాసన సభ ఎన్నికల సందర్భంగా చేసిన ప్రసంగాల్లో ఎక్కడా మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, మాజీ ఉపరాష్టప్రతి హమీద్ అన్సారీకి దేశం పట్ల ఉన్న నిబద్ధతను ప్రశ్నించలేదు, ప్రశ్నించాలని ఆలోచించలేదని రాజ్యసభ నాయకుడు, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం రాజ్యసభలో ప్రకటించారు. దీనితో గత వారం రోజులనుండి ఈ అంశంపై రాజ్యసభలో నెలకొన్న ప్రతిష్ఠంభనకు తెరపడింది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోదీ చేసిన ప్రసంగాలపై ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్ వారం రోజులుగా సభలో లేవనెత్తుతున్నారు. ఎన్నికల సందర్భంగా ఇరు పక్షాలు పలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. వీటిమూలంగా రాజ్యసభలో ప్రతిష్ఠంభన కొనసాగటం ఎంతమాత్రం సబబు కాదని జైట్లీ తెలిపారు. మన్మోహన్ సింగ్, హమీద్ అన్సారీకి దేశంపట్ల గల నిబద్ధతను నరేంద్ర మోదీ ప్రశ్నించారని ఎవరైనా భావిస్తే అది పూర్తిగా సత్యదూరం. మన్మోహన్ సింగ్, హమీద్ అన్సారీ పట్ల తమకు అత్యంత గౌరవభావం ఉన్నదని జైట్లీ వివరించారు. గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ నరేంద్ర మోదీ వ్యక్తిత్వాన్ని విమర్శించటం తమకు కూడా ఇష్టం లేదు. ఎన్నికల సందర్భంగా ఎవరైనా నరేంద్ర మోదీని అగౌరవపరిచే విధంగా మాట్లాడి ఉంటే ఆ మాటలతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆజాద్ ప్రకటించారు. నరేంద్ర మోదీ పట్ల తమకు పూర్తి గౌరవ, మర్యాదలున్నాయని ఆయన అన్నారు. ఉదయం సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్ సభ్యులు పోడియం వద్దకు వచ్చి మన్మోహన్ సింగ్‌ను అవమానించినందుకు నరేంద్ర మోదీ క్షమాపణలు చెప్పాలంటూ పెద్దఎత్తున నినాదాలిచ్చారు. చైర్మన్ ఎం. వెంకయ్య నాయుడు వారిని శాంతపరిచేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్ ఎంపీలు కేవీపీ రామచందర్‌రావు, ఎంఏ ఖాన్, టీ.సుబ్బిరామిరెడ్డి తదితర ఇరవై మంది ఎంపీలు పోడియం వద్దకు వచ్చి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. సభ రెండుసార్లు వాయిదా పడిన అనంతరం అరుణ్ జైట్లీ, గులాం నబీ ఆజాద్ తదితర అధికార, ప్రతిపక్ష నాయకులను తన చాంబర్‌కు పిలిపించుకుని వెంకయ్య నాయుడు చర్చలు జరిపారు. చర్చల్లో కుదిరిన అవగాహన మేరకు అరుణ్ జైట్లీ మధ్యాహ్నం రెండు గంటలకు రాజ్యసభ సమావేశం కాగానే ఒక ప్రకటన చేశారు. మన్మోహన్ సింగ్, హమీద్ అన్సారీకి దేశంపట్ల గల నిబద్ధతను నరేంద్ర మోదీ ఎక్కడా ప్రశ్నించలేదని వివరణ ఇవ్వటంతో సభలో నెలకొన్న ప్రతిష్ఠంభన తొలగిపోయి సజావుగా కొనసాగింది.

‘హామీలను అమలు చేయండి’

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. వచ్చే ఏడాది బడ్జెట్‌కోసం సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశానికి ఎంపీ వై.వీ సుబ్బారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిసి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను వచ్చే బడ్జెట్‌లో పేర్కొని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా, వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజీ, ప్రత్యేక రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టు నిధులు తదితర అంశాలను వచ్చే బడ్జెట్‌లో పెట్టాలని కోరారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు ఉక్కు ఖనిజం గనులను సమకూర్చే అధికారం తమ చేతుల్లో లేదని ఉక్కు శాఖ సహాయ మంత్రి విష్టుదేవ సాయి స్పష్టం చేశారు.

రాజ్యసభలో ఎంపీ విజయసాయి రెడ్డి విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సంబంధించి అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెబుతూ సొంత ఉక్కు గనులకోసం విశాఖ ఉక్కు కర్మాగారం దేశవ్యాప్తంగా జరిగే అనేక వేలంపాటల్లో పాల్గొంటుందని చెప్పారు. సవరించిన గనుల, ఖనిజాల చట్టం ప్రకారం ఏ సంస్థకైనా మైనింగ్ లీజు కేటాయించే అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పరిధిలో మాత్రమే ఉందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

అలాగే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఏపీకి ఇప్పటి వరకు వివిధ మంత్రిత్వాశాఖల నుంచి రూ.12191.78 కోట్లు విడుదల చేసినట్టు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్స్‌రాజ్ అహిర్ పెర్కొన్నారు.కాంగ్రెస్ ఎంపీ ఎంఏ ఖాన్ రాజ్యసభలో ఏపీ విభజన చట్టం అమలుపై అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు.

కొబ్బరి కురిడికి జీఎస్టీ నుంచి మినహాయింపునివ్వాలి.
కోనసిమ ప్రాంతంలో అధికంగా పండించే కోబ్బరి (కోఫ్రా)కురిడి ఉత్పత్తులపై జీఎస్టీ మినహాయింపునివ్వాలని లోకసభలో టీడిపి ఎంపీ పండుల రవీంద్రబాబు డిమాండ్ చేశారు.బుధవారం నాడు జీఎస్టీ సవరణ బిల్లుపై జరిగిన చర్చలో ఎంపీ పండుల ఈ అంశాన్ని లేవనేత్తారు.అలాగే తిరుపతి ఎంపీ వరప్రసాద్ ఈ జిఎస్టీ సవరణ బిల్లు చర్చలో పాల్గొని జీఎస్టీ అమలులోకి వచ్చిన తరువాత చేనేత రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.జీఎస్టీలో చేనతకు పన్నుల స్లాబ్‌లో తక్కువ పరిధిలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.