జాతీయ వార్తలు

హిమాచల్‌ప్రదేశ్ సీఎంగా జైరామ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రిగా జైరామ్ ఠాకూర్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఐదుసార్లు బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన ఠాకూర్ బుధవారం ఎన్డీయే ప్రభుత్వ పెద్దలు, పార్టీ దిగ్గజాల సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. ఠాకూర్ సొంత జిల్లా మండీలోని ప్రతిష్టాత్మక రిడ్జ్ మైదానంలో ఏర్పాటు చేసిన వేదికపై హిమాచల్ గవర్నర్ ఆచార్య దేవ్త్ ఆయనచేత పదవీ, గోప్యతా ప్రమాణం చేయించారు. ఉప ముఖ్యమంత్రిగా మండీ జిల్లా ధరమ్‌పూర్ నియోజవర్గ సీనియర్ ఎమ్మెల్యే మహేంద్ర సింగ్ ఠాకూర్, మంత్రులుగా మరో 10మంది ఎమ్మెల్యేలు పదవీ, గోప్యతా ప్రమాణాలు చేశారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో సురేష్ భరద్వాజ్ (సిమ్లా జిల్లా), కిషన్ కఫూర్ (్ధర్మశాల), అనిల్ శర్మ (మండి జిల్లా), సర్వీన్ చౌదరి (షాపూర్), రామ్‌లాల్ మార్కండ (లాహౌల్), విపిన్ సింగ్ పార్మార్ (సుల్హా), వీరేంద్ర కన్వర్ (కుట్లెయిర్), విక్రమ్ సింగ్ (జశ్వాన్ ప్రాగ్‌పూర్), గోవింద్ సింగ్ (మనాలి), రాజీవ్ సైజల్ (కశౌలి) ఉన్నారు.
స్పీకర్‌గా రాజీవ్ బిందాల్
సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రాజీవ్ బిందాల్ (సిర్మౌర్)కు కేబినెట్‌లో చోటివ్వకపోవడం ఆశ్చర్యం కలిగించింది. అయితే, బుధవారం సాయంత్రానికి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సత్పాల్ సత్తినుంచి ప్రకటన వెలువడింది. అసెంబ్లీ స్పీకర్‌గా రాజీవ్ బిందాల్‌కు అవకాశం కల్పించే ఉద్దేశంతోనే కేబినెట్‌లోకి తీసుకోలేదని వెల్లడించారు. చౌరా నియోజకవర్గం నుంచి ఎన్నికైన హన్స్‌రాజ్‌కు డిప్యూటీ స్పీకర్ అవకాశం కల్పిస్తున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కేబినెట్‌లో చోటు దక్కనందుకు విక్రమ్ జైర్యల్, నరేంద్ర బ్రగ్టా మద్దతుదారులు కార్యక్రమం మధ్యలో కొద్దిసేపు ఆందోళనకు దిగారు. అయితే, సీనియర్లు జోక్యం చేసుకోవడంతో కార్యక్రమంగా ప్రశాంతంగా సాగిపోయింది. రిడ్జ్ మైదానంలో పెద్దఎత్తున జరిగిన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, పార్టీ సీనియర్ నాయకుడు ఎల్‌కె అద్వానీ, మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ నేతలు హాజరయ్యారు.
ప్రజా సంక్షేమం కోసం జైరామ్ ఠాకూర్ సారధ్యంలోని బీజేపీ కొత్త ప్రభుత్వం అలుపెరగని పనితీరు ప్రదర్శిస్తుందన్న ఆశాభావాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు. ట్విటర్ వేదికగా సీఎం ఠాకూర్, ఆయన కేబినెట్‌కు అభినందనలు తెలుపుతూ రాష్ట్భ్రావృద్ధి, ప్రజా సంక్షేమానికి అంచనాలకు మించి పనిచేయాలని ప్రధాని మోదీ సూచించారు.

సిమ్లా కాఫీపై మోదీ మోజు

సిమ్లా, డిసెంబర్ 27: సిమ్లా కాఫీకి దేశంలో ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. చివరికి ప్రధాని నరేంద్ర మోదీని కూడా సిమ్లా కాఫీ ఆకర్షించింది. అందుకే ఆయన హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లాలో పేరొందిన ప్రఖ్యాత కాఫీహౌస్‌లో కాఫీ తాగారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన ప్రధాని పర్యటన షెడ్యూల్‌లో కాఫీ అంశం లేదు. అయినప్పటికీ ఆయన అందర్నీ ఆశ్చర్యచకితులను చేస్తూ భద్రతా చర్యలను కాదని ఇండియన్ కాఫీ హౌస్‌కు నేరుగా వెళ్లి జనంతో కలిసి ఆయన కాఫీ తాగారు. ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన పలువురు మీడియా ప్రతినిధులను పేర్లతోసహా పలకరించారు. మోదీ గతంలో బీజేపీ హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర ఇన్‌చార్జిగా ఉన్న ఎనిమిదేళ్ల కాలంలో ఈ కాఫీహౌస్‌కు తరచూ వెళ్లేవారు. రాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవ్‌వ్రత్ భోజనం ఏర్పాట్లు చేసినా మోదీ భోజనానికి వెళ్లకుండా తనకు ఎంతో ఇష్టమైన కాఫీ తాగడానికే ప్రాధాన్యత ఇచ్చారు.