జాతీయ వార్తలు

హైకోర్టు ఇస్తారా.. లేదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోక్‌సభలో తెరాస లొల్లి దిగివచ్చిన ఎన్డీయే సర్కారు
నేడు ప్రత్యేక ప్రకటనకు హామీ
న్యూఢిల్లీ, డిసెంబర్ 27: తెరాస సభ్యుల వత్తిడికి తలవంచిన ఎన్టీయే సర్కారు తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు అంశంపై గురువారం లోక్‌సభలో ప్రకటన చేస్తామని హామీ ఇచ్చింది. కేంద్ర న్యాయ శాఖా మంత్రి రవిశంకర్‌ప్రసాద్ బుధవారం లోక్‌సభలో ఈమేరకు ప్రకటన చేశారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేసే అంశంపై తెరాస ఆందోళన తమ దృష్టికి వచ్చిందని, హైకోర్టును విభజించే అంశంపై లోక్‌సభలో ఒక ప్రకటన చేస్తామని హామీ ఇచ్చారు. లోక్‌సభలో బుధవారం చాలా రోజుల తరువాత మరోసారి తెలంగాణ నినదించింది. రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ ఎంపీలు జితేందర్‌రెడ్డి, కవిత, వినోద్‌కుమార్, బూర నరసయ్యగౌడ్, కొండా విశే్వశ్వరరెడ్డి, బిబి పాటిల్, మల్లారెడ్డి, గడ్డం నగేష్, పి దయాకర్ సభను స్తంభింపజేశారు. ఎంపీల నినాదాలతో సభ రెండుసార్లు వాయిదా పడింది. లోక్‌సభ బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగానే తెరాస లోక్‌సభాపక్ష నేత జితేందర్‌రెడ్డి తామిచ్చిన వాయిదా
తీర్మానంపై చర్చ జరపాలని పట్టుబట్టారు. వాయిదా తీర్మానాన్ని ఆమోదించే ప్రసక్తే లేదని స్పీకర్ సుమిత్రా మహాజన్ స్పష్టం చేశారు. జీరోఅవర్‌లో మాట్లాడేందుకు అవకాశం ఇస్తానన్నారు. అయితే తెరాస సభ్యులు 8మంది పోడియం వద్దకు దూసుకువచ్చి తమకు హైకోర్టు కావాలంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. జితేందర్‌రెడ్డి తన సీట్లో నిలబడగా మిగతా 8మంది ఎంపీలు పోడియం వద్ద ‘వి వాంట్ హైకోర్ట్’ అంటూ సభ దద్దరిల్లేలా నినాదాలు చేశారు. తెరాస ఎంపీలతోపాటు కాంగ్రెస్ ఎంపీలు కొందరు పోడియం వద్దకు వచ్చి కేంద్ర మంత్రి హెగ్డే వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తూ నినాదాలు చేయడంతో సభ దద్దరిల్లింది. స్పీకర్ సుమిత్రా మహాజన్ వీరి గొడవ, గందరగోళం మధ్యనే ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టేందుకు ప్రయత్నించారు. అయితే కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలతోపాటు తెరాస ఎంపీలు పోడియం వద్ద చేసిన గొడవ మూలంగా సభ స్తంభించడంతో సుమిత్రా మహాజన్ కేవలం తొమ్మిది నిమిషాల పాటు మాత్రమే సభను నిర్వహించగలిగారు. ప్రతిపక్ష సభ్యుల నినాదాలతో సభ ముందుకు సాగటం కష్టం కావటంతో, సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేసి వెళ్లిపోయారు. మళ్లీ లోక్‌సభ సమావేశమైనప్పుడూ కాంగ్రెస్, తెరాస సభ్యులు పోడియం వద్దకు దూసుకువచ్చి తమ డిమాండ్లపై నినాదాలు చేశారు. కాంగ్రెస్, తెరాస, ఇతర ప్రతిపక్ష సభ్యుల నినాదాలతో సభ గందరగోళంలో పడింది. సభ్యులను శాంతింపజేసేందుకు సుమిత్రా మహాజన్ తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. తెరాస సభ్యులు తమ సీట్లలోకి వెళితే ఆ పార్టీ సభ్యుడు జితేందర్‌రెడ్డి తన వాదన వినిపించవచ్చని స్పీకర్ సూచించారు. జితేందర్‌రెడ్డి కూడా హైకోర్టు అంశంపై మాట్లాడేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్ర డిమాండ్‌ను సభ ముందు పెట్టిన తరువాత మళ్లీ పోడియం వద్ద గొడవ చేయవచ్చన్నది ఆయన వాదన. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చేవరకు పోడియం వద్ద గొడవ చేయవలసిందేనని ఎంపీ కవిత స్పష్టం చేసినట్లు తెలిసింది. దీంతో తెరాస సభ్యులు పోడియం వద్దే నిలబడి తెలంగాణకు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలంటూ నినాదాలు చేశారు. 8మంది తెరాస సభ్యుల నినాదాలతో లోక్‌సభ దద్దరిల్లింది. దీంతో సుమిత్రా మహాజన్ లోక్‌సభను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేసి వెళ్లిపోయారు. లోక్‌సభ 2 గంటలకు సమావేశమైనప్పుడూ తెరాస సభను స్తంభింపజేసింది. రాష్ట్ర విభజన జరిగి నాలుగేళ్లు గడుస్తున్నా హైకోర్టును ఏర్పాటు చేయరా? అంటూ తెరాస ఎంపీలు పట్టుబట్టారు. రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేసేవరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ దశలో న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ జోక్యం చేసుకుని అవిభాజిత హైకోర్టును విభజించి తెలంగాణకు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేసే అంశంపై గురువారం లోక్‌సభలో ప్రకటన చేస్తామని హామీ ఇచ్చారు. హైకోర్టు విషయంలో తెరాస ఎంపీలు వ్యక్తం చేస్తున్న ఆందోళన ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు. మంత్రి హామీతో తెరాస ఎంపీలు తమ సీట్లలోకి వెళ్లిపోయారు.