జాతీయ వార్తలు

హెగ్డేను తప్పించాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్ర మంత్రిపై లోక్‌సభలో విపక్షం పట్టు కొనసాగిన వాయిదాల పర్వం
రాజ్యాంగ వ్యతిరేక వ్యాఖ్యలంటూ నిరసన లౌకికవాదులను కించపరిచారని ఆగ్రహం

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: లౌకికవాదంపై, భారత రాజ్యాంగంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు కేంద్రమంత్రి అనంత్‌కుమార్ హెగ్డేను తక్షణం పదవి నుంచి తప్పించాలని లోక్‌సభలో బుధవారం నాడు విపక్ష సభ్యులు పట్టుబట్టారు. తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడడంతో సభను స్పీకర్ సుమిత్రా మహాజన్ పలుమార్లు వాయిదా వేశారు. తొలుత కాంగ్రెస్ పక్షం నాయకుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ, ‘లౌకికవాదులకు వారి తల్లిదండ్రులెవరో తెలియద’ని మంత్రి హగ్డే చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని అన్నారు. లౌకికవాదంపై, రాజ్యాంగంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పటికీ ప్రభుత్వం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను అవమానించేలా మంత్రి వ్యాఖ్యలున్నాయని అన్నారు. ‘లౌకిక వాదాన్ని సమర్థించేవారికి తమ తల్లిదండ్రుల గురించి తెలియదు.. వారి రక్తం ఎక్కడిదో వారికి తెలియదు.. అయినా వారు విమర్శకులుగా, లౌకికవాదులుగా చెలామణి అవుతున్నారు..’ అంటూ మంత్రి హెగ్డే ఇటీవల కర్నాటకలో అన్నారని ఖర్గే గుర్తు చేశారు. ఈ వ్యాఖ్యలు ఎవరికీ ఆమోదయోగ్యం కాదని, లౌకికవాదాన్ని సమర్థించేవారు తమ తల్లిదండ్రులకు తప్ప వేరొకరికి పుట్టారన్న భావం చాలా అవమానకరమన్నారు. ఖర్గే మాట్లాడుతున్న సమయంలో ఉభయ పక్షాల మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
ఖర్గే వాదనను మంత్రి హెగ్డే తోసిపుచ్చుతూ, తన మాటలకు తప్పుడు
అర్థాలు చెబుతున్నారని అన్నారు. ‘రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్‌ను మేం గౌరవిస్తాం.. రాజ్యాంగమే మా రాష్ట్రీయ గ్రంథం అని ప్రధాని మోదీ ఎప్పుడో చెప్పారు.. లౌకికవాదం గురించి కాంగ్రెస్ పార్టీ మాకు పాఠాలు చెప్పనక్కర్లేదు.. కుహనా లౌకికవాదాన్ని కాంగ్రెస్ ప్రోత్సహిస్తోంది.. ఆనాడు ఎన్నికల్లో పోటీచేయకుండా అంబేద్కర్‌ను అడ్డుకున్నది కాంగ్రెస్ వారే.. ఆయనను రాజ్యసభకు ఎంపిక చేసింది జన్‌సంఘ్ పార్టీయే.. అంబేద్కర్ వారసత్వాన్ని మా ప్రభుత్వం కాపాడుతోంది..’ అని మంత్రి హెగ్డే ఎదురుదాడి చేశారు. శీతాకాల సమావేశాలను అడ్డుకునేందుకే విపక్షం ఇలా రభస చేస్తోందన్నారు. విపక్షం నిరసనల మధ్య మంత్రి తన ప్రసంగం కొనసాగించారు. ఈ గందరగోళం నేపథ్యంలో లోక్‌సభ మూడుసార్లు వాయిదా పడింది. అనంతరం మధ్యాహ్నం 2.45 గంటలకు తిరిగి సభ సమావేశం కాగా కొందరు విపక్ష సభ్యులు ‘వెల్’లోకి ప్రవేశించి పోస్టర్లు ప్రదర్శించారు. దీంతో సభా నిబంధనలు పాటించాలని స్పీకర్ విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత నాలుగు గంటల సమయంలో సభ మరోసారి వాయిదా పడింది. సభను వాయిదా వేయాలని ఆర్‌ఎస్పీ ఎంపీ ఎన్‌కే ప్రేమచంద్రన్ కోరగా, జిఎస్టీ సవరణ బిల్లును ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టారు. గందరగోళ పరిస్థితుల్లో అత్యంత కీలకమైన జిఎస్టీ సవరణ బిల్లును ఆమోదించరాదని ప్రేమచంద్రన్ అన్నారు. సభలో సాధారణ పరిస్థితి నెలకొనేందుకు వాయిదా వేయాలన్నారు.
కాగా, తెలంగాణలో ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని తెరాస సభ్యులు కోరారు. పాకిస్తాన్‌లో కులభూషణ్ జాదవ్ కుటుంబ సభ్యుల పట్ల అక్కడి భద్రతా సిబ్బంది అమర్యాదగా ప్రవర్తించారని మరికొందరు ఎంపీలు సభ దృష్టికి తెచ్చారు. స్పీకర్ పదే పదే విజ్ఞప్తి చేసినా సుమారు 20 మంది సభ్యులు ‘వెల్’లో నిరసన కొనసాగించారు. సభ్యులంతా తమ తమ స్థానాల్లో కూర్చోవాలని స్పీకర్ మరోసారి కోరారు. సభను స్తంభింపజేయడం సరికాదని ఖర్గేను ఉద్దేశించి స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్నారు. జాదవ్ ఉదంతంపై శివసేన సభ్యులు పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతకుముందు ప్రశ్నోత్తరాల సమయంలోనూ ఖర్గే కేంద్రమంత్రి హెగ్డే వ్యాఖ్యలను ప్రస్తావించారు. అంబేద్కర్‌ను అవమానించేవారిని తాము క్షమించేది లేదన్నారు.