జాతీయ వార్తలు

తలాక్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,డిసెంబర్ 28: దేశంలోని ముస్లిం మహిళల గుండెలపై కుంపటిగా మారిన ‘ట్రిపుల్ తలాక్’ను క్రిమినల్ నేరంగా పరిగణిస్తూ, ఈ తప్పు చేసే వారికి మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించేలా ‘ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లు’ను లోక్‌సభ గురువారం ఆమోదించింది. ఈ బిల్లుపై అధికార, విపక్షాలకు చెందిన సభ్యులు సుదీర్ఘంగా చర్చించడంతో రాత్రి సమయంలో తలాక్ బిల్లును ఆమోదించారు. లోక్‌సభ ఆమోదించడంతో ఈ బిల్లును శుక్రవారం రాజ్యసభలో చర్చకు ప్రవేశపెడతారు. ‘పెద్దల సభ’లోనూ సమ్మతి పొందాక ఈ బిల్లు రాష్టప్రతి ఆమోదంతో చట్టరూపం ధరిస్తుంది. ట్రిపుల్ తలాక్ బిల్లును లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ బిల్లును లోకసభలో ప్రతిపాంచారు.
ఎంఐఎం సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీతోపాటు పలువురు విపక్ష సభ్యులు మొదట ఈ బిల్లు ప్రతిపాదనను గట్టిగా వ్యతిరేకించారు. ఓవైసీతోపాటు కొంతమంది విపక్ష సభ్యులు ప్రతిపాదించిన సవరణలు వీగిపోయాయి. ఓవైసీ ప్రతిపాదించిన ఒక సవరణకు అనుకూలగా ఆయన తప్ప ఇంకెవరూ మద్దతు ఇవ్వలేదు. ట్రిపుల్ తలాక్‌ను
అరికట్టేందుకు చట్టం రూపొందించాలని సుప్రీం కోర్టు కొంత కాలం క్రితం ఆదేశించటం తెలిసిందే. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం దేశంలోని ప్రజలందరికీ ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయాలనుకోవటం తెలిసిందే. మోదీ ప్రభుత్వం తన లక్ష్యసాధన కోసం సుప్రీం కోర్టు తలాక్‌పై ఇచ్చిన తీర్పును విజయవంతంగా ఉపయోగించుకుంది. గురువారం ఉదయం ప్రతిపాదించిన తలాక్ బిల్లు రాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో లోక్‌సభ ఆమోదం పొందడం గమనార్హం.
దేశంలోని కోట్లాది మంది ముస్లిం మహిళల ప్రయోజనాలను కాపాడేందుకు ఈ చట్టం ఎంతో అవసరమని, ఈ బిల్లుకు మద్దతు ఇవ్వటం ద్వారా చరిత్ర సృష్టించాలని రవిశంకర్ ప్రసాద్ ప్రతిపక్ష సభ్యులకు విజప్తి చేశారు. ముస్లిం మహిళల హక్కులను కాపాడటంతోపాటు వారికి న్యాయం చేయటమే తమ ప్రభుత్వం ప్రధాన లక్ష్యం తప్ప వారి ప్రార్థనా విధానం, మతపరమైన అంశాలలో జోక్యం చేసుకోవటం కానే కాదని రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. ట్రిపుల్ తలాక్ బిల్లు విషయంలో ప్రభుత్వం తొందరపాటును ప్రదర్శిస్తోందని లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున ఖర్గేతోపాటు ఇతర ప్రతిపక్ష పార్టీల సభ్యులు ఆరోపించారు. ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు, ముస్లిం వర్గానికి చెందిన ఇతర ప్రముఖులందరితో లోతుగా చర్చలు జరిపి, తగు మార్పులు,చేర్పులు చేసిన అనంతరం ఈ బిల్లును పార్లమెంటు ముందుకు తీసుకురాలని ప్రతిపక్షం సభ్యులు వాదించారు. అయితే, మంత్రి రవి శంకర్ ప్రసాద్ మాత్రం ప్రతిపక్షం వాదనను గట్టిగా తోసిపుచ్చారు. ట్రిపుల్ తలాక్ బిల్లు ముస్లిం మహిళలకు అన్యాయం చేస్తోందని, వారి హక్కులను హరిస్తోందని, మత నాయకులు, మేధావులతో చర్చించకుండానే బిల్లును రూపొందించారంటూ అసదుద్దీన్ ఓవైసీ విమర్శలు గుప్పించారు. ట్రిపుల్ తలాక్ బిల్లుకు తమ మద్దతు ఉన్నదని, అయితే తలాక్ చెప్పే ముస్లిం పురుషులకు మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించే ప్రతిపాదనను తాము గట్టిగా వ్యతిరేకిస్తున్నామని మల్లికార్జున ఖర్గే చెప్పారు. ప్రభుత్వం తొందరపడే బదులు అందరితో చర్చించి ఏకాభిప్రాయం ద్వారా బిల్లుకు పార్లమెంటు ఆమోదం తీసుకోవటం మంచిదని ఆయన సూచించారు. ట్రిపుల్ తలాక్ మూలంగా జైలుకు వెళ్లే పురుషుడు తన కుటుంబాన్ని ఎలా పోషించగలుగుతాడని ప్రతిపక్షాల సభ్యులు ప్రశ్నించారు. ఈ బిల్లును మొదట పార్లమెంటు స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపించాలని ఖర్గే డిమాండ్ చేశారు. అయితే ప్రభుత్వం ప్రతిపక్షం సూచనలు, సలహాలు తోసిపుచ్చింది. దాదాపు ఆరున్నర గంటల చర్చ అనంతరం ట్రిపుల్ తలాక్ బిల్లుకు లోక్‌సభలో ఆమోదముద్ర వేశారు.
*

గతకాలపు సంకెళ్ళగు
మతతత్వపు చిహ్నమైన మ(దాం)గాంధాకారమ్
యాతనలనుండి ముస్లిం
సతులకికస్వేచ్ఛనొసగు చట్టమ్మిదిరా!