జాతీయ వార్తలు

ఏకాభిప్రాయం అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 28: త్రిపుల్ తలాక్‌ను శిక్షార్హ నేరంగా పరిగణిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన బిల్లుపై సభ్యులందరూ ఏకాభిప్రాయ ప్రాతిపదికగా ముందుకు రావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోదీ చేసిన ప్రసంగ వివరాలను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత కుమార్ గురువారం నాడిక్కడ మీడియాకు వివరించారు. ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ పేరిట చేపడుతున్న ఈ బిల్లును ఏకాభిప్రాయ ప్రాతిపదికగా పార్లమెంటు ఆమోదించాలని మోదీ చాలా బలంగా ఆకాంక్షించినట్లు ఆయన వెల్లడించారు. ఈ బిల్లు ముసాయిదాకు సంబంధించిన అనేక అంశాలను న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ బీజేపీ సభ్యులకు వివరించారు. ఈ బిల్లును పార్లమెంటులో ప్రభుత్వం ప్రవేశపెట్టడం, లోక్‌సభ దీనిని ఆమోదించడం అన్నది చారిత్రక దినంగా అనంతకుమార్ అభివర్ణించారు. లోక్‌సభలో ఈ బిల్లు ఆమోదం పొందినప్పటికీ విపక్షాల మెజారిటీలో ఉన్న రాజ్యసభలో నెగ్గే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు ‘ఎగువ సభలో కూడా దీనిపై ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రయత్నిస్తాం’ అని ఆయన జవాబిచ్చారు. ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలైందనీ, టీఎంసీ, బీజేడీ సహా అనేక పార్టీల సభ్యులతో ప్రభుత్వం మంతనాలు జరుపుతోందని అన్నారు.

చిత్రం..బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొన్న అనంతరం బయటకి వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ