జాతీయ వార్తలు

తాత్కాలిక హైకోర్టుకు ఓకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 28: ఏపీ ప్రభుత్వం వసతి సౌకర్యం కల్పించిన వెంటనే అక్కడ తాత్కాలిక హైకోర్టు ఏర్పాటవుతుందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. హైకోర్టు విభజన విషయమై మంత్రి రవిశంకర్ ప్రసాద్ గురువారం లోక్‌సభలో ఒక ప్రకటన చేశారు. ఏపీలో శాశ్వత హైకోర్టును ఏర్పాటు చేయడంలో జాప్యం జరుగుతుందని, అయితే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తాత్కాలిక భవనానికి ఆమోదం తెలిపిన వెంటనే తాత్కాలిక ప్రాతిపదికపై హైకోర్టు ప్రారంభమవుతుందని ఆయన స్పష్టం చేశారు.
తాత్కాలిక హైకోర్టు కోసం నాలుగు భవనాలను ఏపీ సర్కారు చూపిస్తున్నా, అందులో ఒక భవనాన్ని ఎంపిక చేయాలంటూ ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ కూడా రాశామని మంత్రి తెలిపారు. భవనాన్ని ఎంపిక చేసిన వెంటనే తాత్కాలిక హైకోర్టును ప్రారంభిస్తారని తెలిపారు. హైదరాబాద్‌లో ఇప్పుడున్న హైకోర్టు తెలంగాణకు వెళ్తుందని, ఏపీలో హైకోర్టుకు శాశ్వత భవనాన్ని నిర్మించేందుకు కొంత సమయం పడుతుందని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం కొంత ఆర్థిక సహాయం అందజేస్తుందన్నారు. తెలంగాణ, ఏపీ ప్రజలు ప్రేమాభిమానాలతో కలిసిమెలిసి బతకాలని రవిశంకర్ ప్రసాద్ సూచించారు. కాగా, తాత్కాలిక హైకోర్టును ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం నాలుగు భవనాలను ప్రతిపాదించడాన్ని తాము స్వాగతిస్తున్నామని లోక్‌సభలో టీఆర్‌ఎస్ పక్షం నాయకుడు జితేందర్‌రెడ్డి అన్నారు. ఆంధ్ర ప్రజలతో కలిసిమెలిసి ఉండేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, హైకోర్టు విభజనను త్వరగా పూర్తిచేయాలని విజప్తి చేశారు.
హామీలు పూర్తి చేయాలి
విభజన చట్టంలో ఇచ్చిన అన్ని హామీలను పూర్తిచేయాలని తెలుగుదేశం సభ్యుడు, కేంద్ర మంత్రి సుజనా చౌదరి సూచించారు. ఉమ్మడి హైకోర్టు విభజనపై చర్చ జరుగుతున్న సమయంలో ఆయన జోక్యం చేసుకుంటూ, హైకోర్టు విభజన గురించే మాట్లాడడం మంచిది కాదని సూచించారు. విభజన చట్టంలో ఇచ్చిన ఇతర హామీలను కూడా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దీనికి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్ స్పందిస్తూ సుజనాచౌదరి కేంద్ర ప్రభుత్వం ప్రతినిధి కనుక అతనికి బదులు లోక్‌సభలో టీడీపీ పక్షం నాయకుడు తోట నరసింహంకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని సూచించారు. సుజనా చౌదరి మంత్రిగా ఉంటూ ఏపీ ప్రభుత్వం తరపున మాట్లాడడం మంచిది కాదని స్పీకర్ సుమిత్రా మహాజన్ కూడా పరోక్షంగా సూచించారు. చౌదరి చెబుతున్న దానిని తాము కూడా సమర్థిస్తున్నామని, ఉమ్మడిగా కలిసి సమస్యలను పరిష్కరించుకోవాలని జితేందర్‌రెడ్డి సూచించారు. ఉమ్మడి హైకోర్టు వల్ల న్యాయమూర్తుల ఎంపికలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని జితేందర్‌రెడ్డి అన్నారు. దీనికి స్పందించిన న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ న్యాయమూర్తులను కొలీజియం నియమిస్తున్నప్పుడు అన్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. కాగా, రెండు రాష్ట్రాల శాసనసభల సీట్లు పెంచే ప్రతిపాదన ఏమైందని సుజనా చౌదరి ప్రశ్నించారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు, ఇతర సమస్యల పరిష్కారం గురించి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరస్పరం చర్చించుకోవాలని హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సూచించారు. విభజన చట్టంలోని హామీల అమలు సమస్యలను పరిష్కరించేందుకు తనవైపు నుండి పూర్తి సహాయ, సహకారాలు ఉంటాయని ఆయన హామీ ఇచ్చారు.