జాతీయ వార్తలు

పాకిస్తాన్..ముర్దాబాద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 28: లోక్‌సభ గురువారం పాకిస్తాన్ ముర్దాబాద్ నినాదాలతో మార్మోగింది. అధికారపక్షంతోపాటు ప్రతిపక్షానికి చెందిన కొందరు ఎంపీలు కూడా పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేస్తూ భారత నావికా దళం అధికారి కుల్‌భూషణ్ జాదవ్ తల్లి అవంతి, భార్య చేతన పట్ల అవలంభించిన అవమానకర విధానం పట్ల తీవ్ర ఆగ్రహం, ఆవేశం, ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఇద్దరు మహిళలను అవమానించి అవహేళనకు గురిచేసిన పాక్ తీరు పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని, పాక్‌తో అన్ని రకాల సంబంధాలను తెంచుకోవాలని పలువురు ఎంపీలు డిమాండ్ చేశారు.
జైల్లో ఉన్న కుల్‌భూషణ్‌యాదవ్‌ను పరామర్శించేందుకు వచ్చిన అతని తల్లి, భార్య పట్ల పాకిస్తాన్ ప్రభుత్వం, మీడియా వ్యవహరించిన తీరుపై విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ఒక ప్రకటన చేసినప్పుడు లోక్‌సభలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. జాదవ్ తల్లి, భార్య పట్ల పాకిస్తాన్ ప్రభుత్వ అమానుషత్వాన్ని, పాక్ మీడియా తీరును అత్యంత పరుషపదజాలంతో ఖండించాలని పార్లమెంటు ఉభయ సభలు డిమాండ్ చేశాయి. జాదవ్ తల్లి, భార్యను అవమానించిన పాక్ ప్రభుత్వ తీరును వివరించే సమయంలో సుష్మాస్వరాజ్ కంటతడిపెట్టారు. పాకిస్తాన్ ప్రభుత్వం పథకం ప్రకారం జాదవ్ తల్లి, భార్యను అవమానించిందని ఆమె ఆరోపించారు. సుష్మా స్వరాజ్ మాట్లాడినంతసేపు అధికార, ప్రతిపక్ష సభ్యులు పాకిస్తాన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం గమనార్హం.
జాదవ్ తల్లి, భార్యను అక్కడి ప్రభుత్వం అడుగడుగునా అవమానించి, అవహేళనకు గురిచేశారని, ఆ ఇద్దరు మహిళల మాంగల్యానికి ప్రతిరూపమైన మంగళసూత్రాన్ని తొలగించడం ద్వారా పాక్ ప్రభుత్వ తీరు అత్యంత హేయం, అసభ్య, అమానకర పద్ధతిలో వ్యవహరించిందని ఆమె ఆవేశంతో చెప్పారు. జాదవ్ భార్య చేతన చెప్పులు తీసుకుని ఇంతవరకు మళ్లీ ఇవ్వలేదని, పాక్ ప్రభుత్వం ఈ చెప్పులను అడ్డం పెట్టుకుని తప్పుడు ఆరోపణలు చేసే అవకాశం ఉన్నదని ఆమె అన్నారు. తమ అనుమానాన్ని పాకిస్తాన్ ప్రభుత్వానికి తెలియజేశామన్నారు. తాము అనుమానించిన విధంగానే పాక్ ప్రభుత్వం చేతన చెప్పుల్లో కెమెరా ఉన్నందని, ఇనుప ముక్క ఉందని, చిప్ ఉన్నదంటూ తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఆమె విమర్శించారు. అవంతి, చేతనల దుస్తులు కూడా మార్చడం ద్వారా అత్యంత అసభ్యకరంగా వ్యవహరించిందని, అవంతి తన కుమారుడు జాదవ్‌తో మాతృభాష మరాఠీలో మాట్లాడేందుకు అనమతించకుండా అత్యంత జుగుప్సాకరంగా పాక్ వ్యవహరించిందన్నారు. అవంతి మరాఠీలో మాట్లాడేందుకు ప్రయత్నించగానే పాక్ అధికారులు మైక్ కట్ చేసి తమ అమానుషాన్ని ప్రకటించుకున్నారని సుష్మాస్వరాజ్ దుయ్యబట్టారు. అవంతి, చేతనల నుదుటిబొట్టును కూడా బలవంతంగా తొలగించటం ద్వారా పాకిస్తాన్ అధికారులు జాదవ్‌ను మానసికంగా హింసించేందుకు ప్రయత్నించారని ఆమె వాపోయారు. పాకిస్తాన్ మీడియాను ఇద్దరు మహిళల వద్దకు రానివ్వకూడదనేది ఇరుపక్షాలు అంగీకరించిన తరువాత కూడా పాకిస్తాన్ ప్రభుత్వం వారి వద్దకు మీడియాను పంపించి అత్యంత అమానుషంగా వ్యవహరించారని సుష్మా ఆరోపించారు. ఇద్దరు మహిళలు ధరించిన చీరల స్థానంలో సల్వార్, కుర్తాను తొడిగించారని, చేతులకున్న గాజులు సైతం తొలగించారని ఆమె అన్నారు. భారత రాయబార కార్యాలయం అధికారినైనా అవంతి, చేతనల వెంట వెళ్లకుండా చేశారని ఆమె తెలిపారు. జాదవ్‌ను కలిసి వచ్చిన అనంతరం వారిద్దరితో తాను మాట్లాడినట్లు సుష్మా చెప్పారు. జాదవ్ వత్తిడిలో మాట్లాడుతున్నట్లు తనకు అర్థమైందని అవంతి తనతో చెప్పారని ఆమె వెళ్లడించారు. తల్లి నుదుటిపై బొట్టు లేకపోవటంతో తన తండ్రికి ఏదో ప్రమాదం సంభవించిందని భావించిన జాదవ్ ‘బాబా’ బాగున్నాడా అని అడిగారన్నారు. మానవీయ దృక్పథంతో జాదవ్‌తో తల్లి, భార్య సమావేశం ఏర్పాటు చేశామని చెప్పుకుంటున్న పాకిస్తాన్ వాస్తవానికి ఈ సంఘటనను ప్రచారం కోసం వాడుకుంటోందని ధ్వజమెత్తారు. ఇద్దరు మహిళల పట్ల పాక్ ప్రభుత్వం అత్యంత అమానుషంగా, అసభ్యకరంగా, అవమాకరంగా వ్యవహరించిందని, అందుకే పాక్ వ్యవహారాన్ని తాము తీవ్రంగా ఖండించామని ఆమె అన్నారు. జాదవ్ తల్లి, భార్య పట్ల పాకిస్తాన్ ప్రభుత్వం వ్యవహరించిన అవమానకర తీరును పార్లమెంటు ముక్తకంఠంతో ఖండించింది.