జాతీయ వార్తలు

తెలుగు రాష్ట్రాల నుండి రెండు లక్షల మంది గల్ఫ్ దేశాలకు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 28: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు నుంచి గడిచిన మూడేళ్ల కాలంలో రెండు లక్షల మంది కార్మికులు జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లినట్లు విదేశాంగ శాఖ సహాయమంత్రి వీకే సింగ్ తెలిపారు. ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో గురువారం అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ, గత మూడేళ్లలో భారతదేశం నుంచి ఆరు గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్లిన కార్మికుల సంఖ్య 17.86 లక్షల వరకు ఉన్నట్టు వెల్లడించారు. అధికారిక ప్రవాస అనుమతి కలిగిన పాస్‌పోర్టుతో పశ్చిమాసియాలోని 18 దేశాలకు ఉపాధి కోసం వలస వచ్చే భారతీయులకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం పొందుపరుస్తుంటుందని తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో స్మార్ట్‌సిటీ మిషన్ కింద ఎంపికైన ఆరు నగరాలలో సుమారు 11,815 కోట్ల రూపాయల ఖర్చుతో వివిధ రకాల ప్రాజెక్టులు చేపట్టడానికి ప్రతిపాదించినట్లు గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పూరి రాజ్యసభలో వెల్లడించారు. ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెబుతూ కాకినాడ, విశాఖపట్నం, తిరుపతి, అమరావతి, గ్రేటర్ వరంగల్, కరీంనగర్ నగరాలు స్మార్ట్‌సిటీ మిషన్ కింద ఎంపికైనట్లు తెలిపారు. అమరావతి, కరీంనగర్‌లలో స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు కార్యకలాపాలు ఇంకా ప్రారంభం కావలసి ఉందని పేర్కొన్నారు.
గిరిజన సమస్యలు పరిస్కరించండి: ఎంపీ కొత్తపల్లి గీత
ఏపీలోని గిరిజన నియోజగవర్గం అరకులో సమస్యలను పరిష్కరించాలని కేంద్రహోంశాఖ రాజ్‌నాథ్ సింగ్‌కు ఎంపీ కొత్తపల్లి గీత విజ్ఞప్తి చేశారు. గురువారం కేంద్రహోంశాఖ మంత్రికి ఆమె వినతిపత్రం సమర్పించారు. మావోయిస్టు ప్రభావిత నియోజకవర్గం నేపథ్యంలో వౌలికవసతులు, సదుపాయాల కల్పనలో పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
దక్షిణాది నదుల అనుసంధానంతో
జాతీయ ప్రాజెక్టు చేపట్టండి
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో నదుల అనుసంధానాన్ని కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని ఎంపీ గల్లా జయదేవ్ లోక్‌సభలోప్రస్తవించారు. దక్షిణాది రాష్ట్రాల నదులు వంశధార, గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరి నదులను అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. వ్యాప్కో అనే సంస్థ గోదావరిలోని 320 టీఎంసీల మిగులు నీటిని పెన్నా నది నుంచి కావేరికి పంపాలని ఓ ప్రజంటేషన్ ఇచ్చిందన్నారు. ఈ ప్రాజెక్టు అంచనా రూ.80 వేల కోట్లు అవుతుందని, దక్షిణాది రాష్ట్రాలకు ఉపయోగపడే ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేపట్టాలని గల్లా జయ్‌దేవ్ లోక్‌సభలోప్రస్తావించారు.