జాతీయ వార్తలు

భారత్ సరిహద్దులో రెండుచోట్ల పాక్ కాల్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ, డిసెంబర్ 28: పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పూంఛ్ జిల్లాలోని జమ్మూకాశ్మీర్‌లో గురువారం రెండుసార్లు కాల్పులకు తెగబడింది. ఈ ప్రాంతాల్లోని సరిహద్దులో గల భారత సైనిక దళాలు, పలు గ్రామాలను లక్ష్యంగా చేసుకుని పాక్ ఈ చర్యలకు పాల్పడింది. అయితే, ఈ సంఘటనల్లో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లినట్టు సమాచారం లేదని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. గురువారం ఉదయం డిగ్వార్ సెక్టార్‌లో మూడు గ్రామాల్లో పాక్ దళాలు కాల్పులు జరపడం ద్వారా స్థానికులను భయభ్రాంతులను గురిచేశాయని తెలిపారు. గురువారం సాయంత్రం పూంఛ్ జిల్లాలోని ఖరి కమారా సెక్టార్ పరిధిలో సరిహద్దు ప్రాంతంలో పాక్ సైన్యం మరోసారి కాల్పులు జరిపిందని తెలిపారు. ఈ నేపథ్యంలో రజౌరీ జిల్లా పరిధిలోని వౌషేరా సెక్టార్ పరిధిలో భారత్, పాక్ దళాల మధ్య కాల్పులు జరిగినట్టు తెలిపారు. ఇదిలావుండగా కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన కొద్దిరోజుల వ్యవధిలోనే ఈనెల 23, 24 తేదీల్లో రజౌరీ జిల్లా కేరి సెక్టార్‌లో భారత దళాలపై పాకిస్తాన్ దాడులు జరిపి ఒక మేజర్, ముగ్గురు సైనికులను కాల్చిచంపింది. పూంఛ్ జిల్లాలో షాపూర్ సెక్టార్‌లో దాదాపు నాలుగు గంటలపాటు పాక్ కాల్పులు జరిపింది. అయితే, ఈ సంఘటనలోఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. భారత దళాలు ఈనెల 25న రావల్‌కోట్‌లోని రుఖ్‌చక్రి సెక్టార్‌లో భారత దళాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు పాకిస్తాన్ సైనికులను హతమార్చారు. ఈ ఏడాది జమ్మూకాశ్మీర్‌లో పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఇప్పటివరకు 881 సార్లు దాడులు జరిపింది. భారత్ సరిహద్దు, అంతర్జాతీయ సరిహద్దులో పాక్ జరిపిన దాడుల్లో 34 మంది పౌరులు మరణించారు. ఈ గత ఏడేళ్లలో ఇదే అత్యధికం. ఈ ఏడాది డిసెంబర్ 10వరకు పాక్ 771 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి వ్యవహరించింది.