జాతీయ వార్తలు

44 మంది ఏఐఏడీఎంకే నేతలపై వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, డిసెంబర్ 28: తమిళనాడులోని ఆర్కేనగర్ అసెంబ్లీ స్థానానికి ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో శశికళ మేనల్లుడు, ఇండిపెండెంట్ అభ్యర్థిగా విజయం సాధించిన టీవీవీ దినకరన్‌కు పరోక్షంగా మద్దతు పలికిన పలువురు ఏఐఏడీఎంకే నాయకులను ఆ పార్టీ బహిష్కరించింది. 44 మందిపై బహిష్కరణ వేటు వేయడంతోపాటు పార్టీలో వివిధ స్థాయిల్లో ఉన్న మరో ఇద్దరిని ఆయా పదవుల నుండి తప్పించింది. ఈమేరకు పార్టీ సమన్వయకర్తలు, రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం 44 మంది పార్టీ విధివిధానాలను వ్యతిరేకించినందుకు పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి తొలగిస్తున్నట్టు ప్రకటించారు. దినకరన్‌కు మద్దతు ఇచ్చి బహిష్కరణకు గురైనవారిలో మధురైలోని మేలూర్ మాజీ ఎమ్మెల్యే ఆర్.స్వామి కూడా ఉన్నారు. దినకరన్‌కు మద్దతు ఇచ్చిన మధురై, విల్లుపురం, ధర్మపురి, తిరుచురాపల్లి, పెరంబ్లూర్ నుండి బహిష్కరణకు గురైన వారంతా ఇకనుండి పార్టీలో ఏ హోదాలోనూ కొనసాగేందుకు ఏకోశానా అవకాశం లేదని పన్నీర్‌సెల్వమ్, పళనిస్వామి ప్రకటించారు. పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేసినందున ‘ఆ నేతలను బహిష్కరించాం’ కనుక ఆయా పార్టీ కార్యకర్తలు బహిష్కృత నేతలతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని కోరారు. పత్తుకొట్టాయ్, వెల్లూర్ జిల్లాల్లో ఇద్దరు నాయకులను కూడా పార్టీ పదవుల నుండి తొలగిస్తున్నట్టు పళనిస్వామి, పన్నీర్‌సెల్వం వెల్లడించారు.