జాతీయ వార్తలు

కేంద్రమంత్రి హెగ్డే క్షమాపణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 28: రాజ్యాంగంపై కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి అనంతకుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలు వరుసగా రెండోరోజూ పార్లమెంట్‌లో దుమారం లేపాయి. తాను చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి హెగ్డే లోక్‌సభలో ఎట్టకేలకు క్షమాపణలు చెప్పారు.
అయితే, కేంద్రమంత్రి వివరణ సహేతుకంగా లేదని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్‌లో అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇటీవల కర్ణాటకలో జరిగిన ఓ సమావేశంలో హెగ్డే మాట్లాడుతూ ..రాజ్యాంగాన్ని మారుస్తున్నామంటూ వ్యాఖ్యలు చేశారు. తమ తల్లిదండ్రులెవరో తెలియని కొందరు లౌకికవాదం గురించి మాట్లాడతారని చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో పాటు, పార్లమెంట్ ఉభయసభల్లో బుధవారం జరిగిన సమావేశంలో విపక్ష సభ్యులు దీనిపై నిరసన వ్యక్తం చేశారు. అలాగే విపక్షాలు హెగ్డేను మంత్రివర్గం నుంచి తొలగించాలంటూ డిమాండ్ చేయడంతో సభ పలుమార్లు వాయిదా పడింది. అయితే దీనిపై తనపై వస్తున్న విమర్శలకు గురువారం లోక్‌సభలో క్షమాపణలు తెలిపారు. సభలో కేంద్రమంత్రి ప్రకటన చేస్తూ..తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, రాజ్యాంగం, పార్లమెంట్, బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని ఆయన పేర్కొన్నారు. అలాగే రాజ్యాంగమే మనకు సుప్రీం అని నమ్ముతానని, ఒక భారత పౌరుడిగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా తాను వ్యవహరించబోనని, తన వ్యాఖ్యల వల్ల ఎవరైనా బాధపడితే వారికి క్షమాపణ చెబుతున్నానని అని హెగ్డే వెల్లడించారు. అయితే హెగ్డే వివరణపై ప్రతిపక్ష కాంగ్రెస్ అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్రమంత్రి అనంతకుమార్ వివరణ సహేతుకంగా లేదని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ ఎంపీలు, సీనియర్ నేతలు పాల్గొన్నారు.
హెగ్డే వ్యాఖ్యలపై
రాజ్యసభ వాయిదా
కేంద్రమంత్రి హెగ్డే రాజ్యాంగ్యంపై చేసిన వ్యాఖ్యలపై గురువారం రాజ్యసభ రెండుసార్లు వాయిదా పడింది. పాకిస్తాన్ జైల్లో ఉన్న కుల్‌భూషణ్ జాదవ్ కుటుంబసభ్యుల పట్ల అక్కడి అధికారుల వైఖరిని కేంద్ర విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ చేసిన ప్రకటన అనంతరం కేంద్రమంత్రి హెగ్డే వ్యాఖ్యలను ప్రతిపక్ష నాయకులు రాజ్యసభలో లేవనెత్తారు. అయితే రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు గులాంనబీ ఆజాద్ మాట్లాడుతూ కేంద్రమంత్రి రాజ్యసభలో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి విజయ్ గోయల్ మాట్లాడుతూ లోక్‌సభలో కేంద్రమంత్రి హెగ్డే క్షమాపణలు చెప్పారని, దానిని చదివి వినిపించే ప్రయత్న చేశారు. కానీ కేంద్రమంత్రి విజయ్ గోయల్ సమాధానికి శాంతించని విపక్ష సభ్యులు నినాదాలు కొనసాగించారు. దీంతో చైర్మన్ వెంకయ్యనాయుడు విపక్ష సభ్యులను సభ కొనసాగించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అయితే, విపక్ష సభ్యులు వినకపోవడంతో సభను 15 నిమిషాలపాటు వాయిదా వేసి వెళ్లిపోయారు. అనంతరం ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభమైన తరువాత కేంద్రమంత్రి హెగ్డే చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యుడు హరిప్రసాద్ లేవనెత్తారు. దీనితో కాంగ్రెస్ సభ్యులు తమ స్థానంలో నిల్చుని నిరసన తెలిపారు. తరువాత విపక్ష సభ్యులు నినాదాలు కొనసాగిస్తున్న సమయంలో చైర్మన్ జోక్యం చేసుకొని కాంగ్రెస్ సభ్యుడు హరిప్రసాద్‌పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తరువాత కాంగ్రెస్ సభ్యులు పోడియం వద్దకు వచ్చి నిరసనలను తెలపడంతో చేసేది లేక చైర్మన్ సభను రెండు గంటలపాటు వాయిదా వేసి వెళ్లిపోయారు.